యోగి ఆదిత్యనాథ్ సంస్థ హిందూ యువ వాహినితో అనుబంధంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని హిందూ జాగరణ్ మంచ్, అలీఘర్‌లో హిందువులు మెజారిటీ విద్యార్థులుగా ఉన్న క్రిస్టియన్ పాఠశాలలలో 'క్రిస్మస్' జరుపుకోవద్దని హెచ్చరించింది.
హిందూ జాగరణ్ మంచ్ అధ్యక్షుడు సోనూ సవిటా మీడియాతో మాట్లాడుతూ "క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి విద్యార్థులను బొమ్మలు, బహుమతులు తీసుకురమ్మని అడిగారు. అంటే హిందూ విద్యార్థులపై క్రిస్టియన్ భావజాలాన్ని రుద్దుతున్నట్లే కదా" అని పేర్కొన్నారు.
ఇటువంటి చర్యలు హిందూ విద్యార్థుల మనస్తత్వాన్ని ప్రభావితం చేస్తాయని అన్నారు. మేము పిల్లల తల్లితండ్రులతో మాట్లాడతామని.. ఇటువంటి చర్యలను వ్యతిరేకించాలని కోరతామని సోనూ తెలిపారు.