భారతదేశంలో కింగ్ ఫిషర్ గ్రూప్ వ్యవస్థాపకుడిగా, మద్యం మహారాజుగా పేరుగాంచిన విజయ్ మాల్యాకి ఫెరా కేసు విషయంలో ఢిల్లీ కోర్టు సమన్లు పంపించింది. ఈ సంవత్సరం డిసెంబరు 18వ తేదీకల్లా కోర్టులో హాజరు కావాలంటూ పటియాలా హౌస్ కోర్టు తెలియజేసింది. ఇప్పటికి ఎన్నిసార్లు కబురుపెట్టినా రాని మాల్యాకి, ఇదే ఆఖరి పిలుపని, ఇదే చివరి అవకాశమని కోర్టు పేర్కొంది. ఫెరా ఉల్లంఘనలకు సంబంధించి ఎన్‌ఫోర్సుమెంటు డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో ఆయన ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈసారి ఇచ్చిన గడువుతేదీ ముగిసేలోగా మాల్యా హాజరుకాని యెడల, అతన్ని ఆర్థిక నేరంలో నేరస్తుడిగా భావించి, ప్రొసీడింగ్స్‌కు వెళ్లవలసి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. ఇప్పటికే మాల్యాను ఆర్థిక నేరస్తుడిగా భావించాలని, అందుకు తగ్గ ప్రకటన విడుదల చేయాలని కోరుతూ ఎన్‌ఫోర్సుమెంటు డైరెక్టరేట్ కోర్టును ఆశ్రయించింది. ఈ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీన మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేయబడింది.