/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

కేరళ రాష్ట్రం ఇటీవలి కాలంలో మళ్లీ వార్తల్లో నిలిచింది. గతంలో దళితులను గుళ్లో పూజారులుగా నియమించిన ఇదే  ప్రాంతం ఈసారి ముస్లిములు విషయంలో కూడా మరో సంస్కరణ పద్ధతికి వేదికైంది. దేశచరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా ఓ కేరళ మహిళ జుమ్మా నమాజ్‌కు ఇమామ్‌గా వ్యవహరించింది. 34 సంవత్సరాల జమిథా ప్రస్తుతం మల్లప్పురంలోని ఖురాన్ సున్నతి సొసైటీకి సెక్రటరీగా కొనసాగుతున్నారు. ఖురాన్ లాంటి పవిత్ర గ్రంథాన్ని పఠించడంలో వివక్ష ఉండకూడదని.. ఈ పనిని పురుషులతో పాటు స్త్రీలు కూడా చేయవచ్చని ఆమె తెలిపారు. స్త్రీలు ఇమామ్‌గా వ్యవహరించకూడదని ఖురాన్ లేదా ఏ ఇతర ముస్లిం గ్రంథాలు తెలపలేదని ఆమె అన్నారు. ప్రస్తుతం జమిధా ఓ స్కూలులో టీచరుగా పనిచేస్తున్నారు. ఆమె ఇమామ్‌గా వ్యవహరించి ఖురాన్‌ను పఠిస్తున్నప్పుడు.. ఆ ప్రార్థనల మీటింగ్‌కి కొందరు మహిళలు కూడా హాజరవ్వడం గమనార్హం. అయితే ఇప్పటికే జమిధా ఇమామ్‌గా వ్యవహరించడం పట్ల పలు ముస్లిం సంస్థలు విరుచుకుపడుతున్నాయి. 

Section: 
English Title: 
First Woman Imam in the history of India
News Source: 
Home Title: 

భారతదేశంలోనే తొలి మహిళా ఇమామ్

భారతదేశంలోనే తొలి మహిళా ఇమామ్
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes