Jagadish Shettar Joins In Congress: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార బీజేపీకి భారీ షాక్ తగిలింది. కర్ణాటక మాజీ సీఎం జగదీష్ షెట్టర్ బీజేపీకి గుడ్‌బై చెప్పి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ అధిష్టానం ఆయనకు టికెట్ నిరాకరించడంతో ఆదివారం రాజీనామా చేశారు. సోమవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన జగదీష్ శెట్టర్‌కు భారీ ఓటు బ్యాంకు ఉంది. కర్ణాటక మొత్తం ఓటు బ్యాంకులో 18 శాతం లింగాయత్ కమ్యూనిటీకి చెందిన వారే ఉన్నారు. వీరందరూ ఎప్పటినుంచో బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోడంతో జగదీష్ షెట్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని వీడుతూ.. బరువెక్కిన హృదయంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం రాత్రి కాంగ్రెస్ నేతలతో సమావేశమై.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ తెప్పించుకున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడి కూడా బీజేపీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ తీర్థం పుంజుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికి అసెంబ్లీ టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది.
ఈ సందర్భంగా జగదీష్ శెట్టర్ మాట్లాడుతూ.. తాను ఆదివారం బీజేపీకి రాజీనామా చేసి.. సోమవారం కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు. తాను కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోవడం పట్ల చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారని చెప్పారు. బీజేపీ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని.. కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు ఎదిగానని అన్నారు. సీనియర్ నాయకుడిగా తనకు టికెట్ వస్తుందని అనుకున్నానని.. కానీ అధిష్టానం టికెట్ ఇవ్వట్లేదని చెప్పడంతో షాక్‌కు గురైనట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై బీజేపీ నాయకులు ఎవరూ తనతో మాట్లాడలేదని.. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా ఏ పదవి ఇస్తారో కూడా చెప్పలేదన్నారు.
ప్రస్తుతం హుబ్బళ్లి-ధార్వాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా జగదీష్ శెట్టర్ ఉన్నారు. అయితే కొత్తవారికి అవకాశాలు ఇచ్చే క్రమంలో ఈసారి ఆయనకు అధిష్టానం టికెట్ నిరాకరించింది. తనకు టికెట్ ఇవ్వకపోడంతో బీజేపీ అధిష్టానంపై శెట్టర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ఉత్తర కర్ణాటకలోని చాలా నియోజకవర్గాలపై ప్రభావం పడుతుందని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారని.. బీజేపీ 20 నుంచి 25 సీట్లు కోల్పోయే అవకాశం ఉందన్నారు. జగదీష్ శెట్టర్ చేరికతో కాంగ్రెస్ ఎంతవరకు లాభపడుతుందో చూడాలి.
Also Read: Arjun Tendulkar IPL: తమ్ముడు అర్జున్ బౌలింగ్.. స్టాండ్స్‌లో సారా టెండూల్కర్ సందడే సందడి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook