Ghulam Nabi Azad launches new party, flag: కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తన కొత్త పార్టీని ప్రకటించారు మరియు జెండాను ఆవిష్కరించారు.మహాత్మా గాంధీ సిద్ధాంతాలు, ఆదర్శాలకు అనుగుణంగా తన పార్టీకి 'డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ' (Democratic Azad Party (DAP) అని నామకరణం చేశారు. నీలం, తెలుపు, ఆవరంగులతో కూడిన పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. తాను ఏ రాజకీయ పార్టీ ఎజెండాను అనుసరించడం లేదని, తాను సంప్రదింపులు జరపలేదని, ప్రజాస్వామ్య సూత్రాలను అనుసరిస్తూ స్వతంత్రంగా పనిచేస్తున్నానని ఆజాద్ అన్నారు. కొత్త పార్టీ పేరు విషయంలో సుమారు 1500 మంది నుంచి సూచనలు వచ్చాయని...వాటిని పరీశీలించి పార్టీ పేరును పెట్టినట్లు ఆజాద్ తెలిపారు.
''మా పార్టీకి ఏ ప్రాంతీయ లేదా జాతీయ పార్టీతో సంబంధం లేదు. మేము ఏ పార్టీ సిద్ధాంతాల ద్వారా ప్రభావితం కాలేదు. యువత, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమ పార్టీ కృషి చేస్తుంది'' అని ఆజాద్ అన్నారు. "నీలం రంగు అనేది సముద్రపు లోతుల నుంచి ఆకాశం వరకు హద్దులను తెలుపుతుంది. ఇది ఆలోచన మరియు వాక్ స్వాతంత్ర్యం, ప్రేరణ, జ్ఞానం, విధేయత, విశ్వాసం వంటివి సూచిస్తుంది. తెలుపు శాంతి మరియు గాంధీ ఆదర్శాలను సూచిస్తుంది. అయితే ఆవ రంగు వినూత్నతను, భిన్నత్వంలో ఏకత్వం అనే భావను సూచిస్తుంది" అని ఆజాద్ అన్నారు. నవరాత్రుల శుభారంభం సందర్భంగా తన పార్టీ పేరును ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
Also Read: 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. దసరాకు డబ్బేడబ్బు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Ghulam Nabi Azad: కొత్త పార్టీని ప్రకటించిన గులాం నబీ ఆజాద్, పార్టీ జెండా ఇదే..