ఎయిర్ పోర్టులో రూ.8 కోట్ల బంగారం పట్టివేత!

చెన్నై ఎయిర్ పోర్ట్ ద్వారా అక్రమంగా తరలిస్తున్న 24 కిలోల బంగారాన్ని ఇవాళ అక్కడి ఎయిర్ ఇంటెలీజెన్స్ విభాగానికి చెందిన కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Updated: Jan 12, 2019, 12:39 PM IST
ఎయిర్ పోర్టులో రూ.8 కోట్ల బంగారం పట్టివేత!
SOURCE : ANI

చెన్నై: చెన్నై ఎయిర్ పోర్ట్ ద్వారా అక్రమంగా తరలిస్తున్న 24 కిలోల బంగారాన్ని ఇవాళ అక్కడి ఎయిర్ ఇంటెలీజెన్స్ విభాగానికి చెందిన కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు దక్షిణ కొరియా దేశస్తులను కస్టమ్స్ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ. 8 కోట్లు ఉంటుందని, ఎక్కడి నుంచి ఈ బంగారాన్ని భారత్‌కి తీసుకువచ్చారు ? ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టామని అధికారులు తెలిపారు.