India's first solar-powered village: దేశంలోనే తొలి సోలార్ విలేజ్ గా గుజరాత్ రాష్ట్రంలోని మోధేరా నిలవనుంది. ఈ మేరకు ఇవాళ ప్రధాని మోదీ (PM Modi) ప్రకటన చేయనున్నారు. భారత్ లోని ప్రఖ్యాత సూర్యదేవాలయాల్లో మోధేరా ఒకటి. ఇక నుంచి ఈ ఆలయంలో లైటింగ్, 3డీ ప్రొజెక్షన్ అన్నీ సౌరవిద్యుత్తుతోనే నడుస్తాయి. ప్రధాని మోదీ నేటి నుంటి మూడు రోజులపాటు గుజరాత్ లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా అక్టోబర్ 8, 9 తేదీల్లో గుజరాత్లో పర్యటించనున్నారు. దాదాపు 27 ఏళ్లుగా గుజరాత్లో అధికారంలో ఉన్న బీజేపీకి ఆప్ ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని చూస్తోంది.
''క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలన్న ప్రధానమంత్రి దార్శనికతను నెరవేర్చడంలో గుజరాత్ మరోసారి ముందంజ వేసినందుకు నేను సంతోషిస్తున్నాను. 2030 నాటికి భారతదేశ ఇంధన అవసరాలలో 50% పునరుత్పాదక ఇంధనం ద్వారా ఉత్పత్తి చేయాలనే ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి మేము కట్టుబడి ఉన్నాము''”అని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. ''విద్యుత్ బిల్లులు సున్నాకి చేరాయి. దాదాపు అన్ని ఇళ్లలో సౌర ఫలకాలు ఉచితంగా అమర్చాం'' అని మొధేరా సర్పంచ్ జతన్బెన్ ఠాకోర్ తెలిపారు.
2011 జనాభా లెక్కల ప్రకారం, బెచరాజి తాలూకాలోని మోధేరా గ్రామంలో 6,373 మంది జనాభా ఉన్నారు. ఈ ప్రాజెక్టు అభివృద్ధికి గుజరాత్ ప్రభుత్వం 12 హెక్టార్లను కేటాయించింది. కేంద్రం, రాష్ట్రాలు రెండు దశల్లో రూ. 80.66 కోట్లు ఖర్చు చేశాయి. గ్రామంలో విద్యుత్తును ఉత్పత్తి చేసే ఇళ్లపై 1 kW సామర్థ్యం కలిగిన సౌరఫలకాలు ఏర్పాటు చేశారు. పగటిపూట విద్యుత్ సోలార్ ప్యానెళ్ల ద్వారా సరఫరా అవుతుంది. సాయంత్రం వేళల్లో బీఈఎస్ఎస్ ద్వారా ఇళ్లకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి