BJP Master Plan for 2024: మిషన్ 2024 లక్ష్యంగా బీజేపి పావులు.. ముఖ్యంగా ఆ 144 సీట్లపైనే కన్నేసిన అమిత్ షా

BJP Master Plan To Win 2024 Lok Sabha Polls: 2019 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న కరిష్మాతో ఎలాగైతే భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చారో.. అదే మోదీ కరిష్మాతో 2024 లోక్ సభ ఎన్నికల్లోనూ మరిన్ని ఎక్కువ సీట్లు గెలిచి అధికారం చేజిక్కించుకునేందుకు భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది.

Written by - Pavan | Last Updated : Oct 8, 2022, 11:54 PM IST
  • అప్పుడు 100 శాతం గెలిచిన రాష్ట్రాల్లో ఇప్పుడు అనుమానాలు
  • అమిత్ షా మానిటర్ చేస్తోన్న టార్గెట్ 144 ఏంటి ?
  • మంత్రులను రంగంలోకి దింపిన బీజేపి
  • ఆ కేంద్ర మంత్రులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహం
  • స్వయంగా క్షేత్రస్థాయిలోకి అమిత్ షా..
  • బీజేపి టార్గెట్ లిస్టులో ఉన్న కీలక నేతల లోక్ సభ స్థానాలు ఏవో తెలుసా ?
BJP Master Plan for 2024: మిషన్ 2024 లక్ష్యంగా బీజేపి పావులు.. ముఖ్యంగా ఆ 144 సీట్లపైనే కన్నేసిన అమిత్ షా

BJP Master Plan To Win 2024 Lok Sabha Polls: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విజయం కోసం బీజేపి ఓ కొత్త ఎత్తుగడను ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది. క్రితంసారి లోక్ సభ ఎన్నికల్లో ఎక్కడెక్కడైతే బీజేపి ఓటమిపాలైందో.. ఆయా లోక్ సభ స్థానాల్లో ప్రధాని మోదీ మెగా ర్యాలీలు చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. తద్వారా ఆయా ప్రాంతాల్లో మోదీ సర్కారుపై నమ్మకం పెంచి ఆ ప్రాంతాల నుంచి కూడా బీజేపి సభ్యులను గెలిపించుకుంటే ఇక తమ మెజార్టీకి తిరుగు ఉండదనేది బీజేపి ప్లాన్.  

అప్పుడు 100 శాతం గెలిచిన స్థానాల్లో ఇప్పుడు అనుమానాలు
2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపి అనేక రాష్ట్రాల్లో 100 శాతం సీట్లు గెలుచుకుంది. ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఢిల్లీలో బీజేపి గత ఎన్నికల్లోనే లోక్ సభ సీట్లన్నీ గెలిచి ఆయా రాష్ట్రాల్లో జండా పాతింది. మధ్యప్రదేశ్‌లోనూ ఒక్క సీటు మినహాయించి అన్ని లోక్ సభ స్థానాలన్నీ బీజేపి వశమయ్యాయి. అయితే, క్రితంసారి గెలుచుకున్న స్థానాల్లో అనేక స్థానాల్లో ఈసారి గెలుపు అంత ఈజీ కాదని.. 2024 ఎన్నికల్లో అందులో కొన్ని స్థానాలు చేజారినా ఆశ్చర్యపోనక్కర్లేదని బీజేపి వద్ద స్పష్టమైన సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. అలా తగ్గనున్న సీట్ల నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు గత లోక్ సభ ఎన్నికల్లో ఓటమిపాలైన 144 స్థానాలపై బీజేపి పోకస్ చేసినట్టు సమాచారం.

ఏంటా టార్గెట్ 144..
గత లోక్ సభ ఎన్నికల్లో 144 స్థానాల్లో బీజేపి ఓటమి చెందగా.. అందులోనూ 40 శాతం స్థానాల్లో బీజేపి చాలా స్వల్ప ఓట్ల తేడాతోనే గెలిచే అవకాశాలను చేజార్చుకుంది. అయితే, ప్రస్తుతం బీజేపి ఏమని భావిస్తోందంటే.. ఈసారి సరైన వ్యూహారచన చేసి, దానికి ప్రధాని మోదీ కరిష్మాను జోడిస్తే.. క్రితంసారి స్వల్ప తేడాతో చేజారిపోయిన లోక్ సభ స్థానాల్లో చాలా స్థానాలను ఈసారి కచ్చితంగా చేజిక్కించుకోవచ్చనేది బీజేపి యోచనగా తెలుస్తోంది. అందుకే ఆ దిశగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసే పనిలో బీజేపి హై కమాండ్ తలమునకలై ఉంది. 

మంత్రులను రంగంలోకి దింపిన బీజేపి
క్రితంసారి ఓడిపోయిన 144 లోక్ సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపి ఇప్పటికే ఆయా స్థానాల్లో కేంద్ర మంత్రులను రంగంలోకి దింపింది. అక్కడి నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకునే బాధ్యతలను వారికి అప్పగించింది. అలాగే రాబోయే కాలంలో ఆయా లోక్ సభా స్థానాల్లో ప్రధాని మోదీ మెరుపు ర్యాలీలను నిర్వహించి అక్కడి ఓటర్లలో ఈసారి బీజేపీ సర్కారుపై ఇంకొంత నమ్మకం పెరిగేలా చేసేందుకు బీజేపి ప్లాన్ చేస్తోంది. 

ఆ కేంద్ర మంత్రులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహం
టార్గెట్ 144 లో భాగంగా కేంద్ర మంత్రులకు పలు లోక్ సభ స్థానాలు చూసే బాధ్యతలను అప్పగించగా.. అందులో కొంతమంది ఇప్పటివరకు తమకు అప్పగించిన లోక్ సభ స్థానాల్లో పర్యటించకపోవడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో సదరు కేంద్ర మంత్రులపై అమిత్ షా నిప్పులు చెరిగినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో కోల్పోయే లోక్ సభ స్థానాలను భర్తీ చేసుకునేందుకే ఈ ప్లాన్ సిద్ధం చేశామని.. ఆ ప్రణాళికలు నీరుగారేలా వ్యవహరించి పార్టీ హై కమాండ్ అప్పగించిన బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సదరు కేంద్ర మంత్రులను అమిత్ షా హెచ్చరించినట్టు టాక్.

స్వయంగా క్షేత్రస్థాయిలోకి అమిత్ షా.. మూడంచెల విన్నింగ్ ఫార్ముల అమలు..
టార్గెట్ 144 లో విజయం సాధించేందుకు బీజేపి సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్‌లో మూడు దశలు ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రులకు బాధ్యతలు అప్పగించి వారి ద్వారా నేతలు, కార్యకర్తలు, ఓటర్లను సమన్వయం చేయించడం అందులో మొదటి దశ కాగా.. రెండో దశలో స్వయంగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షానే రంగంలోకి దిగి క్షేత్ర స్థాయిలో పర్యటించి పార్టీపై భరోసా పెరిగేలా చేయడం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్.. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా భారీ బహిరంగ సభలు నిర్వహించడం. ఇది బీజేపి సిద్ధం చేస్తోన్న మూడంచెల విన్నింగ్ ఫార్ములా

బీజేపి టార్గెట్ లిస్టులో సోనియా గాంధీ, ములాయం సింగ్ యాదవ్ లాంటి కీలక నేతల లోక్ సభ స్థానాలు
ఈసారి బీజేపి కన్నేసిన ముఖ్యమైన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలి, ములాయం సింగ్ యాదవ్ సొంత నియోజకవర్గమైన మెయిన్‌పురి, సుప్రియ సూలే ప్రాతినిథ్యం వహిస్తున్న బారామతి, నకుల్ నాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్న చిద్వాడ లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఇవే కాకుండా వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలకు చెందిన అగ్రనేతలు ప్రాతినిథ్యం వహిస్తున్న లేదా వారి స్వస్థలాలు ఉన్న లోక్ సభ స్థానాలను చేజిక్కించుకోవాలని బీజేపి గట్టిగా ప్రయత్నిస్తోంది. అంతకంటే ముందుగా ఆయా లోక్ సభ స్థానాల్లో తిష్టవేసిన సమస్యలు, ఇన్నేళ్ల కాలంలో ఆయా నేతల పనితీరును క్షుణ్ణంగా తెలుసుకుని ఎన్నికల్లో అవే అంశాలను ప్రస్తావించి విజయం సాధించాలని బీజేపి భావిస్తోంది. ఆయా స్థానాలను గెలవడం ద్వారా లోక్ సభలో వారికి ఎంట్రీ లేకుండా చేయడంతో పాటు ఆయా పార్టీల ఆత్మస్థైర్యం కూడా దెబ్బతీయవచ్చనేది బీజేపి ఆలోచనగా తెలుస్తోంది. రాజకీయాల్లో, ఎన్నికల రణరంగంలో ఇది షరా మామూలే కదా.

Also Read : Bullet Train in India: ఇండియాలో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ రన్ ఎప్పుడో చెప్పేసిన రైల్వే శాఖ మంత్రి

Also Read : Mission 2024: నితీష్ రాకతో కాంగ్రెస్ లో జోష్.. విపక్షాలను ఏకం చేసే పనిలో సోనియా గాంధీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News