1000 కిలోల బాంబులతో పాకిస్తాన్‌లో 50 కిమీ లోపలికి వెళ్లిన భారత యుద్ధ విమానాలు!

పాకిస్తాన్‌లో 50 కిలోమీటర్లు లోపలికి వెళ్లిన భారత యుద్ధ విమానాలు!

Last Updated : Feb 26, 2019, 11:00 AM IST
1000 కిలోల బాంబులతో పాకిస్తాన్‌లో 50 కిమీ లోపలికి వెళ్లిన భారత యుద్ధ విమానాలు!

న్యూఢిల్లీ: పుల్వామా దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు సరైన సమయం కోసం వేచిచూస్తున్న భారత్ అందుకు సోమవారం అర్ధరాత్రి దాటాక మంగళవారం తెల్లవారుజామునం మంచి ముహూర్తంగా ఎంచుకుంది. తెల్లవారుజామున 3:30 గంటలకు ఇరుదేశాల మధ్య వున్న సరిహద్దు రేఖ దాటి వెళ్లిన భారత యుద్ధ విమానాలు అక్కడి ఉగ్రవాద శిబిరాలపై బాంబులు విసిరాయి. ఉగ్రవాద శిబిరాలపై దాడిలో 1,000 కిలోల పరిమాణం కలిగిన బాంబులను వినియోగించినట్టు భారత వైమానిక దళం తెలిపింది.

పాకిస్తాన్‌లోని ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్‌ మన్‌షెహ్రా జిల్లాలోని బాలాకోట్ పట్టణం వరకు భారత యుద్ధ విమానాలు చొచ్చుకొచ్చినట్టు పాక్ మిలిటరి వర్గాలు ప్రకటించాయి. భారత్-పాక్ సరిహద్దు రేఖకు సుమారు 50 కిమీ(31 మైళ్లు) దూరంలో ఈ బాలాకోట్ పట్టణం ఉంది. బ్రిటిషోళ్ల నుంచి భారత్-పాకిస్తాన్ దేశాలకు స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం ఇప్పటివరకు రెండు దేశాల మధ్య జరిగిన మూడు యుద్ధాలకు ఇదే సరిహద్దు రేఖ యుద్ధ భూమికి వేదికగా నిలిచింది.

Trending News