COVID-19 vaccine: మధుమేహులందరికి తొలుత వ్యాక్సిన్ ఇవ్వండి: ఐఎంఏ డిమాండ్

COVID-19 vaccine: కొవిడ్ ముప్పు అధికంగా ఉన్నందున డయాబెటీస్ సమస్య ఉన్నవారికి కరోనా టీకాలో ప్రాధాన్యతనివ్వాలని డిమాండ్ చేసింది ఐఎంఏ. వరల్డ్ డయాబెటీస్​ డే సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2021, 09:10 PM IST
  • 'డయాబెటీస్​ ఉన్నవారికి త్వరగా కొవిడ్​ టీకాలు వెయ్యాలి'
  • ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్​
  • వారికి కొవిడ్ ముప్పు అధికంగా ఉండటమే కారణం
COVID-19 vaccine: మధుమేహులందరికి తొలుత వ్యాక్సిన్ ఇవ్వండి: ఐఎంఏ డిమాండ్

IMA demanded Covid-19 vaccination for all diabetes patients: దేశంలో మధుమేహంతో బాధ పడుతున్న వారందరికి కొవిడ్ టీకాలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) డిమాండ్ చేసింది. వారికి కొవిడ్ ముప్పు ఎక్కువగా ఉన్నందున ఈ డిమాండ్ చేస్తున్నట్లు (Indian Medical Associatio) తెలిపింది. ఇంకా అవసరమైతే బూస్టర్ డోసు కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది.

మధుమేహం మేహ సమస్యను ముందుగానే గుర్తించి (campaign for early detection).. జాగ్రత్త పడేందుకు గానూ ఐఎంఐ ఆదివారం వాకథాన్, మారథాన్​, స్క్రీనింగ్ క్యాంపులతో పాటు సోషల్ మీడియా డ్రైవ్​లను నిర్వహించింది. ఇందులో భాగంగానే ఈ డిమాండ్ చేసింది.

యువ డాక్టర్లు, పలు ఆస్పత్రుల కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యాయి.

Also read: Madhya Pradesh: ఆవు పేడ కొనే యోచనలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం, సీఎం వెల్లడి!

100 కోట్ల మందికి అవగాహనే లక్ష్యం..

వరల్డ్ డయాబెటీస్​ డే సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఐఎంఏ. పది రోజులపాటు ఈ డ్రైవ్​ కొనసాగనున్నట్లు తెలిపింది. 100 కోట్ల మందికి మధుమేహంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపింది.

ఈ కార్యక్రమం కోసం ఐఎంఐ.. ఆసోసియేషన్ ఆఫ్​ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా, ఆర్​ఎస్​ఎస్​డీఐ, ఎండోక్రైన్ సొసైటీ సహా పలు ఇతర ఆర్గనైజేషన్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Also read: LPG cylinder blasted: ఎల్పీజీ సిలిండర్ పేలి 17 మందికి గాయాలు, 5 ఇళ్లు ధ్వంసం

Also read: Assam Rifles: భార్యతో ఆ జవాన్ చివరి ఫోన్ కాల్.. దాడికి కొద్ది గంటల ముందు ఏం చెప్పాడంటే

67 లక్షల మంది మధుమేహంతో మృతి..

ఈ సందర్భంగా డయాబెటీస్​కు సంబంధించి పలు గణాంకాలను విడుదల చేసింది (10th Edition of the IDF Diabetes) ఐఎంఐ. ఐడీఎస్​ 10వ ఎడిషన్​ డయాబెటీస్ అట్లాస్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 2021లో ఇప్పటి వరకు 67 లక్షల మంది డయాబెటీస్​తో మరణించినట్లు తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తపంగా 53.7 కోట్ల మంది (20-79 సంవత్సరాల వయసున్న వారు) మధుమేహంతో ఇబ్బందులు పడుతున్నట్లు వివరించింది.

ఈ సంఖ్య 2030 నాటికి 64.3 కోట్లకు, 2045 నాటికి 784 కోట్లకు పెరిగే అవకాశముందని వివరించింది.

మధుమేహం సమస్య పురుషులకన్నా మహిళలకే ఎక్కువగా ఉన్నట్లు ఈ వివేదిక వివరించింది. అయితే కొంత మందిలో ముందుగా నిర్ధారణ కాకపోవడం ఆందోళన కలిగిస్తున్నట్లు పేర్కొంది నివేదిక.

Also read: Gang Rape: మహారాష్ట్రలో దారుణం...మైనర్‌ బాలికపై 400 మంది 6 నెలలుగా అత్యాచారం...

Also read: Centre Ordinace: సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలం ఐదేళ్లకు పొడగింపు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News