INDIA Bloc: మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ను విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు కేజ్రీవాల్‌కు సంఘీభావం ప్రకటించారు. జార్ఖండ్ ముక్తి మోర్చ (జేఎంఎఎం) అధినేత, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్‌ను కూడా ఖండించారు. ఈ అరెస్ట్‌లకు నిరసనగా దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆదివారం 'ప్రజాస్వామ్యాన్ని కాపాడండి' అనే పిలుపుతో విపక్ష ఇండియా కూటమి భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సభకు కాంగ్రెస్‌తో సహా 13 పార్టీల నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరెక్ బబ్రెయిన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, సీపీఐ ఎం నాయకురాలు బృందా కారత్, డీఎంకే నుంచి తిరుచ్చి శివ, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్, సీతారాం ఏచూరి, డి రాజా, ఫరూక్ అబ్దుల్లా, మొహబూబా ముఫ్తీ, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, తదితర నాయకులు హాజరయ్యారు.
Also Read: Lok Sabha Elections: ప్రధాని మోదీని ఇంటికి పంపించే దాకా నిద్రపోం: సీఎం కొడుకు తీవ్ర వ్యాఖ్యలు
సోరెన్, కేజ్రీవాల్ అరెస్ట్‌తోపాటు కాంగ్రెస్‌కు ఐటీ నోటీసులపై ఈ బహిరంగ సభలో అన్ని పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో ఇండియ కూటమి యుద్దం ప్రకటించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు అడ్డంగా దుర్వినియోగం చేస్తోందని ఆయా పార్టీల నాయకులు మండిపడ్డారు. ఈ సభలో అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇండియా కూటమి అనేది అందరి హృదయంగా ఆమె వర్ణించారు.
ఈడీ, సీబీఐ, ఐటీ బీజేపీకి చెందిన విభాగాలుగా తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. మా కుటుంబంపై ఆ సంస్థలతో దాడులు చేస్తున్నా తామెప్పుడూ భయడపలేదని స్పష్టం చేశారు. బీజేపీ 400 ఎంపీ స్థానాల లక్ష్యంపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. 'ఈవీఎంలు లేకుండా.. మ్యాచ్ ఫిక్సింగ్, సోషల్ మీడియా, మీడియాపై ఒత్తిడి పెంచకుండా బీజేపీ 180 సీట్లు ఊడా గెలవలేడని జోష్యం చెప్పారు.
లోక్‌సభ ఎన్నికలపై రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. 'లోక్‌సభ ఎన్నికల్లో ముందు మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది. పేదల నుంచి రాజ్యాంగాన్ని లాక్కోవడానికి ప్రధాని మోదీ, కొంతమంది ధనవంతులు కుట్రతో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు' అని రాహుల్ తెలిపారు. వచ్చే ఎన్నికలు సాధారణం కాదని.. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడే ఎన్నికలుగా ప్రకటించారు.
ఈ సభ వేదిక నుంచే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ప్రకటించింది. దేశవ్యాప్తంగా కోతల్లేని విద్యుత్, పేదలకు ఉచిత విద్యుత్, ప్రతి గ్రామంలో నాణ్యమైన విద్యను పొందే అత్యుత్తమ పాఠశాలల నిర్మాణం, మొహల్లా క్లినిక్ (గ్రామ ఆస్పత్రి), జిల్లాకు ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు, ఢిల్లీకి పూర్తిస్తాయి రాష్ట్ర హోదా వంటి హామీలు ఇచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook