Corona cases in India: దేశంలో స్థిరంగా కరోనా కేసులు- కొత్తగా 9,765 మందికి పాజిటివ్​

Corona cases in India: దేశంలో కొత్తగా 9,765 కరోనా కేసులు బయటపడ్డాయి. యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2021, 10:31 AM IST
  • దేశంలో కొత్తగా 9,765 కరోనా కేసులు
  • కొవిడ్​ నుంచి కోలుకున్న 8,548 మంది
  • 98.35 శాతంగా రికవరీ రేటు
Corona cases in India: దేశంలో స్థిరంగా కరోనా కేసులు- కొత్తగా 9,765 మందికి పాజిటివ్​

India corona Update: దేశంలో కరోనా విజృంభణ దాదాపు స్థిరంగా ఉంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,765 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు (Corona new cases in India) ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. మొత్తం 11,08,467 శాంపిళ్లను టెస్టు చేయగా ఈ కేసులు బయపడ్డట్లు వెల్లడించింది.

ఇదే సమయంలో కొవిడ్ కారణంగా మరో 477 మంది ప్రాణాలు (Corona Deaths in India) కోల్పోయారు. 8,548 మంది కొవిడ్ నుంచి తేరుకున్నారు. 

మరిన్ని వివరాలు..

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 99,763 యాక్టివ్ కరోనా కేసులు (Corona active cases in India) ఉన్నాయి. కరోనా కారణంగా ఇప్పటి వరకు మొత్తం 4,69,724 మంది మృతి చెందారు. దేశంలో కొవిడ్​ మరణాల రేటు 1.36 శాతంగా ఉంది.

ఇప్పటి వరకు దేశంలో 3,46,06541 మందికి కరోనా సోకగా.. అందులో 3,40,37,054 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.35 శాతంగా ఉంది. 

వ్యాక్సినేషన్ ఇలా..

నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా (Covid vaccination in India) 80,35,261 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీనితో ఇప్పటి వరకు దేశంలో ఇచ్చిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,24,96,19,515 వద్దకు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇలా..

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 263,756,570 మందికి కరోనా (Corona cases world wide) సోకింది. అందులో 5,242,126 మంది మహమ్మారికి బలయ్యారు. 238,094,873 మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. 20,419,571 మంది ప్రస్తుతం కొవిడ్ చికిత్స పొందుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ భయాలు వెంటాడుతున్నాయి. తాజాగా అమెరికాలోనూ తొలి ఒమిక్రాన్ వేరియంట్​ కేసు బయటపడింది.

అమెరికాలో నిన్న ఒక్క రోజే 120,441 కొత్త కొవిడ్​ కేసులు రాగా.. 1,633 మంది ప్రాణాలు కోల్పోయారు. యూకేలో 48,374 కేసులు, ఫ్రాన్స్​లో 49,610 కేసులు, జర్మనీలో 71,887 కేసులు నమోదయ్యాయి. 

Also read: Covishield booster dose: త్వరలో బూస్టర్​ డోసుగా కోవిషీల్డ్​​?.. డీసీజీఐని కోరిన సీరమ్​!

Also read: Smartphone For Vaccination: బంపర్ ఆఫర్.. వ్యాక్సిన్ వేయించుకుంటే రూ.60 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News