Covid Cases:దేశంలో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు.. నిన్నటికంటే ఏకంగా ఐదు వేలు హైక్..

Covid 19 Updates: దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. నిన్నటి కంటే ఇవాళ కొత్త కేసులు ఏకంగా ఐదు వేలకు పైగా పెరిగాయి.  గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 20 వేల 557  కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 4 లక్షల 98 వేల మందికి పరీక్షలు చేశారు

Written by - Srisailam | Last Updated : Jul 20, 2022, 11:49 AM IST
  • దేశంలో కొనసాగుతున్న కొవిడ్ కల్లోలం
  • గత 24 గంటల్లో 20557 కొత్త కేసులు
  • లక్షా 45 వేలు దాటిన యాక్టివ్ కేసులు
Covid Cases:దేశంలో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు.. నిన్నటికంటే ఏకంగా ఐదు వేలు హైక్..

Covid 19 Updates: దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. నిన్నటి కంటే ఇవాళ కొత్త కేసులు ఏకంగా ఐదు వేలకు పైగా పెరిగాయి.  గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 20 వేల 557  కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 4 లక్షల 98 వేల మందికి పరీక్షలు చేశారు. గత 24 గంటల్లో కొవిడ్ సోకిన మరో 40  మంది చనిపోయారు. తాజా మృతులతో  దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5 లక్షల 25 వేల 800 దాటింది. 

గత 24 గంటల్లో కొవిడ్ నుంచి మరో  18 వేల 517 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 45 వేలు దాటింది. దేశంలో రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.33 శాతానికి పెరిగింది. పాజిటివిట్ రేటు 4.13శాతంగా ఉంది. దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ మరో మైలురాయిని సాధించింది. దేశంలో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది.  నిన్న మరో 26 లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు దేశంలో 200  కోట్ల 60 లక్షల మందికి పైగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.  

Also Read: Drones in Agriculture: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం... త్వరలో రైతులకు డ్రోన్లు..  

Also Read: Horoscope Today July 20th: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు..   

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News