Corona cases in India: దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు- కొత్తగా 9,119 మందికి పాజిటివ్

Corona cases in India: దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. తాజాగా 9,119 మంది కొవిడ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 539 రోజుల కనిష్టానికి పడిపోయాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2021, 10:43 AM IST
  • దేశంలో తగ్గుతున్న కరోనా విజృంభణ
  • 539 రోజుల దిగువకు యాక్టివ్ కేసులు
  • ప్రపంచవ్యాప్తంగా ఆగని కొవిడ్ కల్లోలం
Corona cases in India: దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు- కొత్తగా 9,119 మందికి పాజిటివ్

Active corona cases in India now at the lowest in 539 days: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,119 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు (Corona cases in India) తెలిసింది. ఇదే సమయంలో కొవిడ్ కారణంగా మరో 396 మంది ప్రాణాలు (Corona deaths in India) కోల్పోయారు.

తగ్గిన కేసులతో దేశంలో యాక్టివ్ కేసులో 539 రోజుల కనిష్ఠానికి పడిపోయినట్లు భారత వైద్య, ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది.

మరిన్ని వివరాలు..

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,09,940 యాక్టివ్ కరోనా కేసులు (Corona Active cases in India) ఉన్నాయి. కరోనా కారణంగా ఇప్పటి వరకు మొత్తం 4,66,980 మంది మృతి చందారు.

ఇప్పటి వరకు దేశంలో 3,45,44,882 మందికి కరోనా సోకగా.. అందులో 3,39,67,962 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

Also read: Free Ration Scheme: ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించిన కేంద్ర ప్రభుత్వం

వ్యాక్సినేషన్ ఇలా..

నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా (Covid vaccination in India) 90,27,638 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీనితో ఇప్పటి వరకు దేశంలో ఇచ్చిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,32,33,15,050 వద్దకు చేరింది.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 22,72,19,901 డోసులు వినియోగం కోసం సిద్ధంగా ఉన్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది.

Also read: Man killed by minor daughter : లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డ తండ్రిని హత్య చేసిన కూతురు

Also read: Naveen Patnaik: ఒడిశా సీఎం కాన్వాయ్​పై కోడిగుడ్ల దాడి...ఎవరు చేశారంటే..

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇలా..

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 259,731,904 మందికికరోనా (World wide corona cases) సోకింది. అందులో 5,192,249 మంది మహమ్మారికి (COVID deaths world wide) బలయ్యారు. 234,886,211 మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. 19,653,444 మంది ప్రస్తుతం కొవిడ్ చికిత్స పొందుతున్నారు.

కొత్త కేసుల పరంగా చూస్తే.. నిన్న స్వల్ప పెరుగుదల నమోదైంది.

అమెరికాలో రికార్డు స్థాయిలో నిన్న ఒక్క రోజే 104,819 మందికి కరోనా పాజిటివ్​గా (Corona cases in USA) తేలింది. కొవిడ్ కారణంగా 1,594 మంది మృతి చెందారు.

జర్మనీలో సైతం కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఒక్క రోజులో ఇక్కడ 73,966 మందికి కొవిడ్ (Corona cases in Germany) సోకింది. 321 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

యూకేలో కొవిడ్ కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. కొత్తంగా 43,676 మందికి కొవిడ్ నిర్ధారణ (Corona cases in UK) అయ్యింది. మరో 149 మంది ప్రాణాలు కోల్పోయారు.

రష్యాలో 33,558 మంది నిన్న ఒక్క రోజే కొవిడ్​ బారిన (Corona cases in Russia) పడ్డారు. కరోనా కారణంగా 1,240 మంది మృతి చెందారు.

ఫ్రాన్స్​, పోలాండ్​, నెదర్లాండ్స్, చెక్​ రిపబ్లిక్​ వంటి దేశాల్లోను కేసులు భారీగా నమోదయ్యాయి.

Also read: ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద విమానాశ్రయానికి మోదీ శంకుస్థాపన

Also read: Cash in drainage pipe: డ్రైనేజీ పైపులో లక్షల కొద్ది అవినీతి సొమ్ము.. ఏసీబీ సోదాల వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News