Naveen Patnaik: ఒడిశా సీఎం కాన్వాయ్​పై కోడిగుడ్ల దాడి...ఎవరు చేశారంటే..

Naveen Patnaik: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కాన్వాయ్‌(Odisha CM's convoy)పై భాజపా మద్దతుదారులు(BJP supporters) గుడ్లతో దాడి చేశారు. కలహండి ఉపాధ్యాయురాలి కిడ్నాప్​, హత్య కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూరీలో ఆందోళనకారులు నిరసన చేపట్టారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2021, 06:34 PM IST
  • ఒడిశా సీఎం కాన్వాయ్‌పై గుడ్ల దాడి
  • పూరీలో హెరిటేజ్​ కారిడార్​ ప్రాజెక్టుకు శంకుస్థాపన
  • నల్లజెండాలతో ఆందోళకారులు నిరసన
Naveen Patnaik: ఒడిశా సీఎం కాన్వాయ్​పై కోడిగుడ్ల దాడి...ఎవరు చేశారంటే..

Naveen Patnaik: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌(Naveen Patnaik) కాన్వాయ్‌పై భాజపా మద్దతుదారులు(BJP supporters) కోడిగుడ్లతో దాడి చేశారు. పూరీలో రూ.331 కోట్ల హెరిటేజ్​ కారిడార్​ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన పట్నాయక్(naveen patnaik)​.. భువనేశ్వర్‌(Bhubaneswar)కు తిరిగి వెళ్తుండగా ప్రభుత్వ ఆసుపత్రి స్క్వేర్​ సమీపంలో ఈ ఘటన జరిగింది.

కలహండి ఉపాధ్యాయురాలు కిడ్నాప్, హత్య కేసు(Kalahandi teacher's kidnap and murder case)లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి డీఎస్​ మిశ్రా(DS Mishra)ను తొలగించాలని కొన్న వారాలుగా ప్రతిపక్షాలు డిమాండ్​ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీరుకు నిరసనగా పూరీలో కొందరు ఆందోళనలు చేపట్టారు. నల్లజెండాలతో నిరసన తెలిపారు. అంతకుముందు.. పూరీలోని గ్రాండ్ రోడ్​లో నల్లజెండాలు ప్రదర్శించిన బీజేవైఎం, కాంగ్రెస్ అనుబంధ ఎన్​ఎస్​యూఐకి చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Also Read: Free Biryani For Tomatoes: బిర్యానీ లవర్స్ కు గుడ్ న్యూస్.. కేజీ టమాటాలకు బిర్యానీ ఉచితం

సీఎం కాన్యాయ్‌పై జయంత్​ దాస్​ నేతృత్వంలో కోడిగుడ్ల దాడి చేసింది తామేనని బీజేవైఎం ఒడిశా అధ్యక్షుడు ఇరాసిస్‌ ఆచార్య(Irasish Acharya) తెలిపారు. పట్నాయక్ తన మంత్రులపై చర్యలు తీసుకునే వరకు ఈ నిరసన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News