Indian Army Helicopter Crashes: జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. కిష్త్వార్ జిల్లాలోని మార్వా తహసీల్‌లోని మారుమూల ప్రాంతమైన మచ్చా గ్రామ సమీపంలో గురువారం ఆర్మీ హెలికాప్టర్ కూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వీరు గాయాలతో బయటపడినట్లు ఆర్మీ అధికారులు చెబుతున్నారు. "ఆర్మీ ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ జమ్మూ & కాశ్మీర్‌లోని కిష్త్వార్ సమీపంలో కుప్పకూలింది. పైలట్లకు గాయాలయ్యాయి. అయితే సురక్షితంగా ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది" అని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.
Indian Army #ALH Dhruv Helicopter crashed near Jammu and Kashmir's Kishtwar area this morning. The chopper crashed in #Machhna village.
Pilots have suffered injuries but are safe and are undergoing treatment.#IADN pic.twitter.com/AfETCUxqG6
— Indian Aerospace Defence News - IADN (@NewsIADN) May 4, 2023
వరుసగా హెలికాప్టర్ కూలిపోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మార్చి నెలలో అరుణాచల్ ప్రదేశ్‌లోని మాండ్లా కొండ ప్రాంతం సమీపంలో ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ చీతా హెలికాప్టర్ కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు డిసెంబర్ 2021లో కూడా హెలికాప్టర్‌లో సాంకేతిక లోపంతో ఆర్మీ హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, ఇతర సహాయక సిబ్బంది మరణించారు. ఈ ప్రమాద ఘటన తరువాత కూడా వరుసగా ఆర్మీకు సంబంధించిన హెలికాఫ్టర్లు కూలిపోతుండడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకు అధికారులు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవట్లేదని ప్రజలు అడుగుతున్నారు.
An Army ALH Dhruv Helicopter crashed near Kishtwar, Jammu & Kashmir. Pilots have suffered injuries but are safe. Further details awaited: Army Officials. pic.twitter.com/ya41m7CRfn
— ANI (@ANI) May 4, 2023
Also Read: KKR Squad Update: కేకేఆర్ జట్టులోకి హార్డ్ హిట్టర్ ఎంట్రీ.. ఇక బౌలర్లకు దబిడి దిబిడే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook