జమ్మూకాశ్మీర్ పై పాక్ దాడిచేసినప్పుడు నెహ్రూ ఆర్ఎస్ఎస్ సహాయం తీసుకున్నారు: ఉమా భారతి

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై 'ఆర్మీ' పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి ఉమాభారతి కొన్ని వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Feb 14, 2018, 01:46 PM IST
జమ్మూకాశ్మీర్ పై పాక్ దాడిచేసినప్పుడు నెహ్రూ ఆర్ఎస్ఎస్ సహాయం తీసుకున్నారు: ఉమా భారతి

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 'ఆర్మీ'పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు భగవత్ క్షమాపణ చెప్పాల్సిందేనని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి ఉమా భారతి కొన్ని వ్యాఖ్యలు చేశారు.

భారతదేశం నుంచి విడిపోయిన కొన్ని సంవత్సరాలకే పాకిస్తాన్ జమ్మూకాశ్మీర్ పై దాడి చేసిందని.. ఆ సమయంలో నాటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆర్ఎస్ఎస్ సహాయం తీసుకున్నారని ఉమాభారతి అన్నారు. నెహ్రూ కోరిక మేరకే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కాశ్మీర్‌కు వెళ్లారని ఆమె చెప్పారు.

'పాకిస్తాన్‌కు స్వాతంత్ర్యం సిద్ధించిన సమయంలో మాహారాజా హరిసింగ్ కాశ్మీర్ ప్రావిన్స్‌కి రాజుగా ఉన్నారు. ఆయన జమ్మూకాశ్మీర్ ఒప్పంద పత్రంపై సంతకం చేయలేదు. షేక్ అబ్దుల్లా ఆయనను సంతకం చేయమని ఒత్తిడి చేశారు. ఆ సమయంలో నెహ్రూ డైలమాలో ఉన్నారు. పాక్ అకస్మాత్తుగా దాడి చేసింది. అప్పుడు సైన్యం వద్ద హై-టెక్ ఆయుధాలు లేవు. అందువల్ల అకస్మాత్తుగా జరిగిన దాడికి త్వరగా రియాక్ట్ కాలేదు" 'అప్పుడు నెహ్రూ ఆర్ఎస్ఎస్ చీఫ్ గురు గొల్వాల్కర్‌కు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సహాయం కావాలని ఉత్తరం రాశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సహాయం చేయడానికి జమ్మూకు వెళ్లారు' అని ఆమె వివరించారు.ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టించిన నేపథ్యంలో ఉమాభారతి ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు, ఉమాభారతి రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నారని వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. నేను రాజకీయాల నుంచి రిటైర్ కావడంలేదని, కొన్ని అనారోగ్య కారణాలవల్ల రానున్న మూడేళ్లు ఎన్నికల్లో పోటీ చేయనని, అయితే బీజేపీతోనే ఉంటానని.. ఎన్నికల ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఈ విషయం చెప్పానని, అందుకు ఆయన అంగీకరించారని అన్నారు.

Trending News