JEE Mains 2021 To Be Held Four Times: వచ్చే ఏడాది నాలుగుసార్లు జేఈఈ మెయిన్స్  

JEE Mains 2021 To Be Held Four Times: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), పలు ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (JEE Mains 2021)ను వచ్చే ఏడాది నాలుగు పర్యాయాలు నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈఈ - మెయిన్స్‌ను ఫిబ్రవరి 2021 నుండి నాలుగుసార్లు నిర్వహిస్తామన్నారు.

Last Updated : Dec 11, 2020, 09:09 AM IST
JEE Mains 2021 To Be Held Four Times: వచ్చే ఏడాది నాలుగుసార్లు జేఈఈ మెయిన్స్  

JEE Mains 2021 To Be Held Four Times: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), పలు ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (JEE Mains 2021)ను వచ్చే ఏడాది నాలుగు పర్యాయాలు నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈఈ - మెయిన్స్‌ను ఫిబ్రవరి 2021 నుండి నాలుగుసార్లు నిర్వహిస్తామన్నారు. గురువారం బోర్డు పరీక్షలు, పోటీ పరీక్షలపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులతో ఆన్‌లైన్ సంభాషణ సందర్భంగా కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఈ ప్రకటన చేశారు. 

సాధారణంగా జేఈఈ-మెయిన్స్ (JEE Mains) 2 పర్యాయాలు నిర్వహిస్తారు. అయితే వచ్చే ఏడాది నుంచి ఫిబ్రవరి నుంచి మే వరకు ప్రతి ఒకసారి JEE Mains 2021 పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు సౌలభ్యాన్ని అందించడానికి ఒకటి లేదా అన్ని పరీక్షలకు హాజరయ్యే ఆప్షన్ ఎంచుకోవచ్చునని మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ (Ramesh Pokhriyal Nishank) పేర్కొన్నారు. మొత్తం పరీక్షలలో అత్యధిక స్కోర్, ర్యాంక్‌ను ప్రవేశాలకు అర్హతగా పరిగణించనున్నారు. 

Also Read : Jobs 2020: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 510 ఉద్యోగాలు

పరీక్ష సిలబస్‌లో ఎలాంటి మార్పు ఉండదు. మొత్తం 90 ప్రశ్నలలో 75 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి వచ్చేలా ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు. జేఈఈ మెయిన్స్ 2020లో అభ్యర్థులు 75 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథ్స్‌ ఒక్కో విభాగంలో 25 ప్రశ్నలకు జవాబు అభ్యర్థులు ఇవ్వాలి.
Also Read : LIC Scholarship 2020: పేద విద్యార్థులకు ఎల్‌ఐసీ గుడ్ న్యూస్

ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 6 వరకు జేఈఈ-మెయిన్స్ 2020 నిర్వహించారు.  ఏప్రిల్- మే నెలలో జరగాల్సి ఉన్న ఉమ్మడి ప్రవేశ పరీక్ష COVID-19 మహమ్మారి కారణంగా తొలుత జూలైకి వాయిదా పడింది. చివరికి సెప్టెంబర్‌ నెలలో పరీక్ష నిర్వహణ సాధ్యమైంది. జేఈఈ పరీక్షలను నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు జరిగేలా ఏర్పాట్లు చేయడం తెలిసిందే.

Also Read : Rise in Prices: టీవీ, ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల ధరలు షాక్.. త్వరలో భారీగా పెంపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News