Teacher Eligibility Test Certificate Validity : ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న టెట్ పాసైన అభ్యర్థులకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ శుభవార్త అందించారు. టెట్ సర్టిఫికెట్ వ్యాలిడిటీని ఏడేళ్ల నుంచి గరిష్టంగా జీవితకాలానికి పొడిగించినట్లు ప్రకటించారు.
IIT JEE Advanced 2021: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) బోర్డ్ ఎగ్జామ్ షెడ్యూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంత్ ఇటీవల ప్రకటించారు. జనవరి 7న జేఈఈ అడ్వాన్స్డ్ తేదీలను ప్రకటించనున్నట్లు మంత్రి తాజాగా తెలిపారు.
CBSE Board Exam 2021 Latest Updates: సిబిఎస్ఇ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 2021 వరకు జరగవని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థులతో మంగళవారం లైవ్ వెబ్‌నార్ ద్వారా సంభాషించిన సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
JEE Mains 2021 To Be Held Four Times: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), పలు ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (JEE Mains 2021)ను వచ్చే ఏడాది నాలుగు పర్యాయాలు నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈఈ - మెయిన్స్‌ను ఫిబ్రవరి 2021 నుండి నాలుగుసార్లు నిర్వహిస్తామన్నారు.
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఢిల్లీకి చెందిన ఐఐటీ ఓ టెస్ట్ కిట్ కరోష్యూర్ (Corosure)ను తీసుకొచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యంత చవకైన కోవిడ్19 టెస్ట్ కిట్ అని తెలిపింది. కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ కరోష్యూర్ కిట్‌ను ఆవిష్కరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.