Terrorist attack in J&K: ఒక ఎస్పిఓ, పౌరుడు మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో నేడు (బుధవారం) జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రత్యేక పోలీసు అధికారి (ఎస్పీఓ) తో సహా పౌరుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 

Last Updated : Mar 4, 2020, 09:17 PM IST
Terrorist attack in J&K: ఒక ఎస్పిఓ, పౌరుడు మృతి

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో నేడు (బుధవారం) జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రత్యేక పోలీసు అధికారి (ఎస్పీఓ) తో సహా పౌరుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం సోపోర్ ప్రాంతంలోని వార్పోరాలో పోలీసు బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీని ఫలితంగా సెక్యూరిటీ పోలీస్ అధికారులు వజాహత్ అహ్మద్, షోకాట్ ఖండే, పౌరుడు గాయపడ్డారని తెలిపారు. 

గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా వారిలో వాజహత్, ఉమర్ సుభాన్ వాగే (సివిలియన్) మరణించినట్లు ప్రకటించారు. దుండగులను గుర్తించడానికి భద్రతా దళాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని తెలిపారు. 
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News