Kabini Elephant Bhogeshwar Died: 60 ఏళ్ల భోగేశ్వర్ మృతి.. ఏనుగు చనిపోతే ఏం చేస్తారో తెలుసా ?

Bhogeshwar Elephant Died: ఈ టైగర్ రిజర్వ్‌లో పులులు చూడటానికి వచ్చిన పర్యాటకులకు పులులు కనిపించినా.. కనిపించకపోయినా.. ఈ భోగేశ్వర్ మాత్రం కబిని బ్యాక్ వాటర్స్‌లో తప్పక దర్శనమిచ్చి అలరిస్తుండేది. అందుకే పర్యాటకులకు సైతం అతి పొడవైన దంతాలు ఉన్న ఈ భోగేశ్వర్ అంటే చాలా ఇష్టం.

Written by - Pavan | Last Updated : Jun 13, 2022, 12:11 AM IST
  • అతి పొడవైన దంతాలున్న ఆసియా ఏనుగుల్లో ఒకటిగా పేరొందిన భోగేశ్వర్
  • బందీపూర్‌లోని టైగర్ రిజర్వ్ పరిధిలోని గుండ్రె రేంజ్‌లో భోగేశ్వర్ మృతి
  • భోగేశ్వర్‌కి ఆ పేరెలా వచ్చిందంటే...
Kabini Elephant Bhogeshwar Died: 60 ఏళ్ల భోగేశ్వర్ మృతి.. ఏనుగు చనిపోతే ఏం చేస్తారో తెలుసా ?

Bhogeshwar Elephant Died: ఆసియాలోనే అతి పొడవైన దంతాలు ఉన్న ఏనుగుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన భోగేశ్వర్ అనే మగ ఏనుగు అనారోగ్య సమస్యలతో మృతి చెందినట్టు కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ డైరెక్టర్ రమేష్ కుమార్ మీడియాకు తెలిపారు. బందీపూర్‌లోని టైగర్ రిజర్వ్ పరిధిలోని గుండ్రె రేంజ్‌లో భోగేశ్వర్ మృతి చెంది కనిపించింది. అటవీ శాఖ సిబ్బంది జరిపిన పంచనామాలో భోగేశ్వర్ వయస్సు రీత్యా తలెత్తిన ఆరోగ్య సమస్యలతోనే మృతి చెందినట్టు తేలింది. అంతేకాకుండా భోగేశ్వర్ శరీరంపై ఎలాంటి గాయాలు కూడా లేవని నిర్ధారణ అయింది. అయితే, గత వారం భోగేశ్వర్‌తో మరో ఏనుగు తలపడిందని.. అప్పటి నుంచే 60 ఏళ్ల ఈ మగ ఏనుగు కొంత బలహీనతకు గురైందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. 

పర్యావరణం, అటవీశాఖ నిబంధనల మేరకు ఏనుగు దంతాలను తొలగించి తదుపరి పరిశీలన కోసం మైసూరు డిపోకు తరలించినట్టు డైరెక్టర్ రమేష్ కుమార్ వెల్లడించారు. అలాగే భోగేశ్వర్ కళేబరాన్ని రాబందులకు ఆహారం కోసం అక్కడే వదిలేశారు.

భోగేశ్వర్‌కి ఆ పేరెలా వచ్చిందంటే..
బందీపూర్ టైగర్ రిజర్వ్‌లోని భోగేశ్వర్ క్యాంపుకు సమీపంలోని కబినీ బ్యాక్ వాటర్స్ ప్రాంతంలోనే అధికంగా కనిపిస్తుండటంతో అటవీ శాఖ సిబ్బంది, అక్కడి గిరిజనులు ఈ ఏనుగుకు ముద్దుగా భోగేశ్వర్ అనే పేరే పెట్టుకున్నారు. ఈ టైగర్ రిజర్వ్‌లో పులులు చూడటానికి వచ్చిన పర్యాటకులకు పులులు కనిపించినా.. కనిపించకపోయినా.. ఈ భోగేశ్వర్ మాత్రం కబిని బ్యాక్ వాటర్స్‌లో తప్పక దర్శనమిచ్చి అలరిస్తుండేది. అందుకే పర్యాటకులకు సైతం అతి పొడవైన దంతాలు ఉన్న ఈ భోగేశ్వర్ అంటే చాలా ఇష్టం. 

అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భోగేశ్వర్ దంతాల్లో ఒకటి 2.58 మీటర్లు ఉండగా.. మరొకటి 2.35 మీటర్లు ఉంది. ఇంత పొడవైన దంతాలు ఉన్నప్పటికీ.. భోగేశ్వర్‌ వాటి వల్ల ఇబ్బంది పడిన సందర్భాలు మాత్రం లేవు అని అధికారులు తెలిపారు.

Also read : Elephant Attack: వృద్ధురాలిపై దాడి చేసి చంపేసిన ఏనుగు.. అంత్యక్రియల సమయంలో చితి వద్దకు వెళ్లి..!

Also read : Bear Video: ట్రాఫిక్ సెన్స్ ఎక్కువైన ఎలుగుబంటి, పడిపోయిన ట్రాఫిక్ కోన్ నిలబెట్టిన వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News