Elephant attacked and killed old woman in Odisha: ఇటీవలి కాలంలో ఏనుగులు అడవుల్లోంచి జనావాసాల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. చేతికొచ్చిన పంటను నష్టం చేయడమే కాకుండా.. స్థానిక ప్రజలపై దాడులు చేస్తున్నాయి. ఒక్కోసారి ప్రజలను చంపేస్తున్నాయి కూడా. తాజాగా ఇలాంటి ఘటనే ఒడిశాలో చోటుచేసుకుంది. ఓ ఏనుగు మయుర్‌భంజ్ జిల్లాలోని 70 ఏళ్ల వృద్ధురాలిపై దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయింది. వృద్ధురాలి అంత్యక్రియల సమయంలోనూ ఆ ఏనుగు మరోసారి దాడి చేసి కలకలం సృష్టించింది.
ఒడిశా మయుర్‌భంజ్ జిల్లా రాయపాల్ గ్రామంలో మాయా ముర్ము అనే ఓ వృద్ధురాలు గురువారం ఉదయం గొట్టపుబావి నుంచి నీటిని తీసుకుంటోంది. అదే సమయంలో దాల్మా వన్య ప్రాణల సంరక్షణ కేంద్రం నుంచి దారితప్పి వచ్చిన ఓ ఏనుగు.. ఆ వృద్ధురాలిని చూసింది. అనే దగ్గరికి వేగంగా వచ్చిన ఏనుగు ఒక్కసారిగా దాడి చేసింది. వృద్ధురాలిని కిందపడేసి కాలితో తొక్కింది. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది.
గురువారం సాయంత్రం మాయా ముర్ము మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఆ ఏనుగు చితిపై ఉన్న మృతదేహంపై మరోసారి దాడి చేసింది. మాయా ముర్ము మృతదేహాన్ని కింద పడేసి తొక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఏనుగు రాకతో భయభ్రాంతులకు గురైన కుటుంబ సభ్యులు, స్థానికులు అక్కడి నుంచి దూరంగా వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత వచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఏనుగు దాడిలో వృద్ధురాలు మరణించిందని రస్‌గోవింద్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ లోపాముద్ర నాయక్ శనివారం మీడియాతో తెలిపారు. విషయం తమకు ఆలస్యంగా తెలిసిందని, కేసు నమోదు చేసుకున్నామని చెప్పారు. ఏనుగు వృద్ధురాలి మృతదేహాన్ని తొక్కేసి పారిపోయింది, కొన్ని గంటల తర్వాత అంత్యక్రియలు నిర్వహించినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తమకు చెప్పినట్టు తెలిపారు.
Also Read: IND vs SA 2nd T20I: రెండో టీ20కి వరుణుడి ముప్పు.. 50% వర్షం పడే ఛాన్స్!
Also Read: Pitradosh: పితృ దోషం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.