కన్నడ తీర్పు: బళ్ళారిలో గాలి హవా

బళ్ళారిలో 'గాలి' హవా నడుస్తోంది.

Last Updated : May 15, 2018, 09:35 AM IST
కన్నడ తీర్పు: బళ్ళారిలో గాలి హవా

బళ్ళారిలో 'గాలి' హవా నడుస్తోంది. బళ్ళారిలో గాలి సోమశేఖరరెడ్డి, హరప్పనహళిలో గాలి కరుణాకర్ రెడ్డి ఆధిక్యతలో ఉన్నారు. ఆయా నియోజకర్గాల నుంచి బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసిన మైనింగ్ కింగ్ గాలి జనార్ధనరెడ్డి సోదరులిరువురూ తమ సమీప ప్రత్యర్థులపై భారీ ఆధిక్యత కనబరుస్తున్నారు. మొత్తానికి బళ్లారిలో గాలి సోదరుల హవా కనిపిస్తున్నది. శ్రీరాములు తదితరులు కూడా తమ సమీప  ఆధిక్యంలో కొనసాగుతున్నారు. శ్రీరాములు బాదామిలో వెనకంజలో ఉన్నారు. మొలకల్మూర్ లో ఆధిక్యంలో ఉన్నారు.

ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి శ్రీరాములు మాట్లాడుతూ, గాలి జనార్దన్‌ రెడ్డి తనకు స్నేహితుడు మాత్రమేనని చెప్పారు. పార్టీ రాజకీయాలతో గాలికి ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు.

 

Trending News