Karnataka Corona cases: కర్ణాటకలో కొవిడ్ ఉగ్ర రూపం- రికార్డు స్థాయిలో కొత్త కేసులు!

Karnataka Corona cases: కర్ణాటకలో కొవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. ఒక్క రోజులోనే ఇక్కడ 50 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2022, 07:59 PM IST
  • కర్ణాటకలో కరోనా విజృంభణ
  • రికార్డు స్థాయిలో పెరిగిన కేసులు
  • బెంగళూరులో అధికంగా ఉద్ధృతి
Karnataka Corona cases: కర్ణాటకలో కొవిడ్ ఉగ్ర రూపం- రికార్డు స్థాయిలో కొత్త కేసులు!

Karnataka Corona cases: కర్ణాటకలో కొవిడ్ విజృంభణ రోజు రోజుకు తీవ్రమవుతోంది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 22.77 శాతానికి పెరిగినట్లు కర్ణాటక ఆరోగ్య విభాగం ఆదివారం (Karnataka Covid Update) ప్రకటించింది.

కొత్త కేసులు ఇలా..

కర్ణాటక వ్యాప్తంగా తాజాగా (జనవరి 22న) 50,210 కరోనా కేసులు (New Corona cases in Karnataka) నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 2,20,459 టెస్టులకు గానూ ఈ కేసులు బయటపడ్డట్లు తెలిపింది. మొత్తం కేసుల్లో బెంగళూరులోనే 26,299 నమోదవడం గమనార్హం.

రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా 22,842 మంది కొవిడ్​ను (Corona recoveries in Karnataka) జయించారు. ఇప్పటి వరకు మొత్తం 3,121,274 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

కర్ణాటకలో ప్రస్తుతం 3,57,796 యాక్టివ్​ కరోనా కేసులు (Active Corona cases in Karnataka) ఉన్నాయి. బెంగళూరులోనే అత్యధికంగా 2.31 లక్షల యాక్టివ్​ కేసులు ఉన్నట్లు తెలిసింది.

ఇక తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 22న 19 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 38,582 మంది కరోనా మహమ్మారికి (Corona deaths in Karnataka) బలయ్యారు.

అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా ఇలా..

ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో రాష్ట్రంలోని అంతర్జాతీయ ఎయిర్​పోర్ట్​ల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది కర్ణాటక ప్రభుత్వం.

జనవరి 22న 1,213 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించింది. ఇప్పటి వరకు మొత్తం 646,404 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించింది. ఇందులో 29,739 మంది హై రిస్క్ దేశాల నుంచి కర్ణాటకకు వచ్చినట్లు తెలిపింది ఆరోగ్య విభాగం.

Also read: Punjab Elections: మా మంత్రిని త్వరలో ఈడీ అరెస్ట్​ చేస్తుంది: అరవింద్ కేజ్రివాల్​

Also read: Omicron Variant Twice: ఒకే వ్యక్తికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎన్నిసార్లు సోకుతుందో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News