Kolkata doctor rape and murder case : కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటన దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రాణం పోసే డాక్టర్ నే అత్యాచారం చేసి, ఆమె ప్రాణం తీయడం ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తూ.. ఆమెకు న్యాయం జరగాలి అని చాలామంది వైద్యులు, విద్యార్థులు రోడ్డు షోలు, ర్యాలీలు కూడా చేశారు. అయితే ర్యాలీలు ఆపాలని , దుర్గాపూజ త్వరలోనే ఉంది అని, శబ్ద కాలుష్యాల వల్ల అటు వృద్ధులు నిద్ర లేకుండా బాధపడుతున్నారని, ర్యాలీల కారణంగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతోందని, నిరసనలు ఆపాలి అంటూ మమతా బెనర్జీ కోరిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా సీఎం మమతా బెనర్జీ పై జూనియర్ డాక్టర్ తల్లి సంచలన ఆరోపణలు చేస్తూ చేసిన కామెంట్లు అందరిని విస్తుపోయేలా చేస్తున్నాయి. తమను బెదిరిస్తున్నారని, డబ్బు ఆఫర్ చేస్తున్నారంటూ ఆమె వాపోయింది. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ఆర్ జి కర్ హాస్పిటల్ లో అత్యాచారంతో పాటు హత్యకు గురైన కోల్కతా ట్రైనీ డాక్టర్ తల్లి మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పోలీసులు లంచం ఇచ్చారని , ఆమె అబద్దాలు చెబుతున్నారని ఆరోపణలు చేశారు. ఆరోపణలను బెనర్జీ తోసి పుచ్చిన తర్వాత ఆమె ప్రభుత్వంపై చేసిన ఆరోపణలలో నిజం లేదని ఆమె అబద్ధం చెబుతోందని చెప్పడంతో ఆమె ఈ విధంగా స్పందించింది.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అబద్ధం చెబుతున్నారు. నష్టపరిహారం ఇస్తామని, మీ కుమార్తె జ్ఞాపకార్థం ఏదైనా నిర్మించుకోవచ్చు అని చెప్పింది. నా కుమార్తెకు న్యాయం జరిగినప్పుడు నేను వస్తానని చెప్పాను. అంతవరకు నేను ఎటువంటి లంచానికి లొంగను అని చెప్పాను అంటూ ట్రైనీ డాక్టర్ తల్లి వెల్లడించింది.
ఆగస్టు 9న ఆర్జీ కర్ ఆస్పత్రిలో జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో మిమత బెనర్జీ గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించింది. తమ నిరసనలను ఆపాలని రాబోయే దుర్గ పూజ ఉత్సవాలకు సిద్ధం కావాలని బెనర్జీ చేసిన విజ్ఞప్తి అమానవీయం అంటూ ఆమె తెలిపింది. నేను ఒక ఆడపిల్లకు తల్లినైనందుకు ఇది నాకు అమానుషంగా అనిపిస్తుంది. నేను ఒక బిడ్డను కోల్పోయాను. మా ఇంట్లో కూడా దుర్గా పూజ జరుపుకునే వాళ్ళము. ఇంట్లో నా కూతురు కూడా చేసేది కానీ ఇప్పుడు మా జీవితాన్ని చీకట్లు కమ్ముకున్నాయి. ఈ సమయంలో పండుగ ఎలా చేసుకోమని ప్రజలకు చెప్పగలను అంటూ ఆమె తెలిపారు. ట్రైని డాక్టర్ తల్లి ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతూ.. మీ ఇంట్లో కూడా ఇలా జరిగితే ఇలాగే చేస్తారా అంటూ ప్రశ్నించింది. మరి దీనిపై సీఎం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Also Read: Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే రాసలీలల ఘటనలో మరో బిగ్ ట్విస్ట్.. ముక్కున వేలేసుకుంటున్న నేతలు..
Also Read: Low Pressure Threat: ఏపీకు పొంచి ఉన్న మరో అల్పపీడనం, తుపానుగా మారుతుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.