మూడు రోజుల క్రితం మే 28న వివిధ రాష్ట్రాల్లో 4 లోకసభ స్థానాలకు, 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాలు గురువారం (మే 31, 2018) వెల్లడవుతున్నాయి. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అయింది. ప్రధానంగా అందరి దృష్టి ఉత్తర్ ప్రదేశ్ లోని కైరానా పార్లమెంటు స్థానంపై నిలిచింది. కొన్ని రోజుల క్రితం ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిలు రాజీనామా చేసిన లోకసభ స్థానాలను విపక్షాలు గెలుచుకున్నాయి. కైరానాలో మైనార్టీ ఓటు బ్యాంకు ఎక్కువ. దీంతో ఈ నియోజకవర్గం ఆసక్తి కరంగా కలిగిస్తోంది.
#Punjab: Visuals from a counting centre in Shahkot, counting of votes for the Assembly by-poll has begun. pic.twitter.com/gsw3i8Ds8O
— ANI (@ANI) May 31, 2018
Counting of votes for 11 Assembly seats (including 10 by-polls) & 4 Lok Sabha constituencies across 11 states begins. pic.twitter.com/LCefTjszNR
— ANI (@ANI) May 31, 2018
Counting of votes for Karnataka's RR Nagar Assembly constituency & 4 Lok Sabha seats (Maharashtra's Bhandara-Gondiya & Palghar, Nagaland & Uttar Pradesh's Kairana) to start shortly.
— ANI (@ANI) May 31, 2018
Counting of votes for 10 Assembly by-polls (Maharashtra's Palus Kadegaon, UP's Noorpur, Bihar's Jokihat, Jharkhand's Gomia & Silli, Kerala's Chengannur, Meghalaya's Ampati, Punjab's Shahkot, Uttarakhand's Tharali & West Bengal's Maheshtala) to start shortly.
— ANI (@ANI) May 31, 2018
యూపీలోని కైరానాతో పాటు మహారాష్ట్రలోని పాల్ఘర్, భండారా–గోండియా స్థానాలతో పాటు నాగాలాండ్‌లోని ఏకైక ఎంపీ స్థానానికి పోలింగ్ నిర్వహిస్తున్నారు. నూపుర్(ఉత్తర ప్రదేశ్), షాకోట్(పంజాబ్), జోకిహట్(బిహార్), గొమియా, సిల్లీ(జార్ఖండ్), చెంగన్నూరు(కేరళ), పాలుస్ కడేగావ్(మహారాష్ట్ర), అంపటి (మేఘాలయ), థరాలి(ఉత్తరాఖండ్) మహేస్థల( పశ్చిమబెంగాల్), ఆర్ఆర్ నగర్ (కర్ణాటక) అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తంగా పదకొండు రాష్ట్రాలలో ఈ ఉప ఎన్నికలు జరగడంతో అధికార ప్రతిపక్షాల మధ్య పోటాపోటీ పరిస్థితి నెలకొంది. రాబోయే 2019 లోక్‌సభ ఎన్నికల సమరంలో జనం నాడికి ఈ ఉప ఎన్నికలను సూచీలుగా భావిస్తున్నారు.
ఎన్నికలు జరిగిన నాలుగు ఎంపీ సీట్లలో మూడు బీజేపీ ఖాతాలో ఉన్నాయి. ఇక ఇటీవలే కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణం కొలువుదీరడం, ప్రతిపక్షాల సంఘటిత శక్తికి సంకేతాలు వెలువడటం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ మొత్తం 14 స్థానాలకు ఉప ఎన్నికలకు విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.