Yogi Adityanath Comments: కాంగ్రెస్ గెలిస్తే దేశంలో ముస్లిం చట్టం అమలు, యోగి ఆదిత్యనాధ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Yogi Adityanath Comments: దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు అందుకున్నారు. ముందు ప్రధాని నరేంద్ర మోదీ...ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదం రేపే వ్యాఖ్యలకు శ్రీకారం చుడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 23, 2024, 08:50 PM IST
Yogi Adityanath Comments: కాంగ్రెస్ గెలిస్తే దేశంలో ముస్లిం చట్టం అమలు, యోగి ఆదిత్యనాధ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Yogi Adityanath Comments: నిన్న ప్రధాని నరేంద్ర మోదీ, నేడు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒకే తరహా వ్యాఖ్యలతో సంచలనం రేపారు. ఇప్పటికే ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా, ఇప్పుడు యోగీ వ్యాఖ్యలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. యోగీ చేసిన వ్యాఖ్యలేంటో తెలుసుకుందాం.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దేశంలోని ఆస్థులన్నీ ముస్లింలకే ఇచ్చేస్తారంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఓ వర్గాన్ని కించపర్చేలా, ఓ మతాన్ని వేరుచేసేలా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తక్షణం చర్యలు తీసుకోవాలని కోరింది. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం అదే తరహా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దేశంలో ముస్లిం చట్టాన్ని తెస్తారంటూ యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో షరియా చట్టాన్ని అమలు చేసి, ప్రజల సంపద తిరిగి వారికే పంచడం వంటివి కాంగ్రెస్ మేనిఫెస్టో ఉద్దేశ్యంగా కన్పిస్తోందన్నారు. యూపీలోని బాగ్‌పత్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా షరియా చట్టం అమలుతో దేశంలో తాలిబన్ పాలన తీసుకురావాలనేది కాంగ్రెస్ ఆలోచనగా ఉందని యోగి విమర్శించారు. వేర్వేరు కమ్యూనిటీలకు వేర్వేరు చట్టాలు అమలు చేస్తామని చెప్పడంలో అర్ధమేంటని ప్రశ్నించారు. ట్రిపుల్ తలాఖ్ చట్టాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేయడంతో షరియా చట్టాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. దేశ వనరులపై తొలి హక్కు ముస్లింలకే ఉందంటూ 2006లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాధ్ ప్రస్తావించారు. అదే నిజమైతే దళితులు, బీసీలు, పేదలు, రైతులు, మహిళలు ఎక్కడికెళ్లాలని ప్రశ్నించారు. 

యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తుందా లేదా అనేది చూడాలి. దేశంలో ఇప్పటికే తొలి దశ ఎన్నికలు ఏప్రిల్ 19న ముగిశాయి. ఏప్రిల్ 26న రెండో దశ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఆ తరువాత  మే 7, 13, 20, 25 తేదీల్లోనూ తిరిగి జూన్ 1న జరగనున్నాయి. 

Also read: Pink Mooon: ఆకాశంలో అద్భుతం, తెల్లవారుజామునే పింక్ మూన్, ఎన్ని గంటలకంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News