Raghu Ramakrishna Raju: కూటమికి వచ్చే సీట్లు ఎన్నో తేల్చేసిన ఎంపీ రఘురామ.. ఆ ఒకటి ఏటు పోతుందో..!

Who Will Win in AP Elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించనుందని ఎంపీ రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు. కూటమికి 130 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ కనుమరుగవుతుందన్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 15, 2024, 03:07 PM IST
Raghu Ramakrishna Raju: కూటమికి వచ్చే సీట్లు ఎన్నో తేల్చేసిన ఎంపీ రఘురామ.. ఆ ఒకటి ఏటు పోతుందో..!

Who Will Win in AP Elections 2024: ఏపీ ఎన్నికల్లో కీలక ఘట్టం పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో భద్రమైంది. జూన్ 4న ఎవరు గెలుస్తారు..? ఎవరు ఓడిపోతారు..? అనే విషయం తేలిపోనుంది. గెలుపు తమదంటే తమదంటూ అధికార వైసీపీ, కూటమి అభ్యర్థులు ధీమాతో ఉన్నారు. రికార్డుస్థాయిలో పోలింగ్ 81.76 శాతం నమోదు కావడంతో ఓటింగ్ ఎటు వైపు మొగ్గు చూపిందనే విషయం ఆసక్తికరంగా మారింది. ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలపై జూన్ 1వ తేదీ వరకు నిషేధం ఉండడంతో గెలుపుపై ఓటరు నాడీ అంచనా వేయడం కష్టంగా మారింది. వైసీపీ, కూటమి పార్టీల్లో ఎవరు గెలిచినా.. మెజారిటీ తక్కువ ఉంటుందనే టాక్ వస్తోంది.  

Also Read: RR Vs PBKS Dream11 Team: నేడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..   

ఇక ఏపీ ఎన్నికల ఫలితాలపై నరసాపురం ఎంపీ, టీడీపీ ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు. పోలింగ్ ఎత్తున తరలిరావడం ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో వైసీపీ ఇక కనిపించదన్నారు. గతంలో తనను పుట్టినరోజు నాడే తనను ఇబ్బందులకు గురి చేశారని.. హత మార్చాలని చూశారని అన్నారు. 
జైలులో తాను చేసిన శపథం నెరవేరిందని.. గత ఎన్నికల్లో వైసీపీ వచ్చిన సీట్లు 151 అని ఈ సంఖ్యలో ఒకటి నంబరు ఎటువైపు పోతుందో తెలియదన్నారు. కూటమి అభ్యర్థులు 130 సీట్లలో విజయం సాధిస్తారని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి క్లీన్‌స్వీప్‌ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఉద్యోగులు పెద్దఎత్తున ఓటుహక్కు వినియోగించుకోవడం దేశ చరిత్రలో ఇదేమొదటిసారి అని.. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచీ ప్రజలు పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు తరలివచ్చారని రఘురామకృష్ణ అన్నారు. కడప జిల్లాలో నాలుగు నుంచి ఐదు సీట్లను తెలుగుదేశం పార్టీని గెలుచుకుంటుందని.. కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాలున్నాయన్నారు. పులివెందులలో జగన్ కంటే షర్మిలకే మెజార్టీ వస్తుందని చెప్పారు. కడపలో తెలుగుదేశం పార్టీ పాగా వేయడం ఖాయమన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కు 50 వేల ఓట్లపైగానే మెజారిటీ వస్తుందన్నారు.  

ఈ సందర్భంగా వైసీపీ నేతలపై ఆయన కామెంట్స్ చేశారు. ఆ పార్టీ నాయకులు ఒక వర్గానికి చెందిన ప్రజలకు మాత్రమే న్యాయం చేశారని.. మిగిలిన వర్గాలు రెట్టించిన ఉత్సాహంతో ఓటింగ్‌లో పాల్గొన్నారని అన్నారు. ఎలాంటి విషయాన్ని అయినా.. తమకు అనుకూలంగా మలుచుకోవడంతో వైసీపీ నాయకులు సిద్ధహస్తులు అని అన్నారు. వైసీపీ అడిగిన ఒక్క ఛాన్స్ అయిపోయిందని.. ఇక వాళ్ల పని అయిపోయిందన్నారు. ఇక నుంచి రానున్నది చల్లటి వాతావరణమని.. ఫ్యాన్‌తో అవసరం లేదని సెటైర్లు వేశారు.  

Also Read: Theatres Closed: థియేటర్లు బంద్‌.. 10 రోజులపాటు బొమ్మపడదు.. ఎందుకో తెలుసా?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News