Pithapuram: 2019 గత ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ కాపు సామాజికవర్గం ఓటర్లు అత్యధికంగా ఉండే గాజువాక, భీమవరం నియోజకవర్గాల్ని ఎంచుకున్నారు. అయితే అనూహ్యంగా రెండు చోట్లా ఆయన ఓడిపోయారు. ఈసారి గెలిచి తీరాలనే ఆలోచనతో కాపులు ప్రభావం చూపించే మరో ముఖ్యమైన నియోజకవర్గం పిఠాపురం ఎంచుకున్నారు. అందుకే పిఠాపురం ఈసారి చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి పిఠాపురంలో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉండగా పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో ముందు ఆయన అలిగారు. ఆ తరువాత చంద్రబాబు నచ్చజెప్పడంతో వర్మ పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా పనిచేశారు. గత ఎన్నికల్లో తనకున్న ప్రజాదరణ గెలిపించలేకపోవడంతో ఈసారి పూర్తిగా కాపు సామాజికవర్గాన్నే నమ్ముకున్నారు పవన్ కళ్యాణ్. అందుకే పిఠాపురంలో పోటీ చేసి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈసారి ఫలితాలు బెడిసికొట్టకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ తరపున చిరంజీవి తప్ప మిగిలిన కుటుంబసభ్యుల్లోని నటులంతా వచ్చి ప్రచారం నిర్వహించారు. నాగబాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, రాంచరణ్ ఇలా అందరూ వచ్చి ప్రచారం చేశారు. వీరికితోడుగా టీవీ ఆర్టిస్టులు, చిన్న చిన్న నటులు ప్రచారంలో ఆకర్షణగా మారారు.
అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని సీరియస్‌గా తీసుకుంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, కాకినాడ ఎంపీ, పిఠాపురం స్థానికురాలు, కాపు సామాజికవర్గానికి చెందిన వంగా గీతను నిలబెట్టారు. పార్టీ తరపున పూర్తి సహకారం అందించారు. వంగా గీతను గెలిపిస్తే ఉప ముఖ్యమంత్రి పదవిస్తామని వైఎస్ జగన్ ఆఫర్ చేశారు.
అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష కూటమి ప్రచారంతో పిఠాపురం ఓటర్లలో చైతన్యం కన్పించింది. 2014 ఎన్నికల్లో 79 పోలింగ్ నమోదైతే 2019లో 80 శాతం పోలింగ్ జరిగింది. ఇక 2024లో ఇప్పుడైతే ఏకంగా 86 శాతం పోలింగ్ నమోదైంది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఏకంగా 6 శాతం పోలింగ్ పెరిగింది.పెరిగిన పోలింగ్ శాతం కచ్చితంగా తమకే లాభిస్తుందని కూటమి వాదనగా ఉంది. పవన్ కళ్యాణ్‌ను గెలిపించేందుకే ప్రతి ఓటరు కదిలాడంటున్నారు జనసైనికులు. ఈసారి పవన్ కళ్యాణ్ విజయం ఖాయమంటున్నారు,
మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి ధీమాతో ఉంది. వైఎస్ జగన్ అందించిన సంక్షేమ పధకాలు, వంగా గీత స్థానికత వంటి అంశాలు కచ్చితంగా ఆమెను గెలిపిస్తాయంటున్నారు. పిఠాపురంలో కాపుల ఓటింగ్ 65 వేలుంటే 86 శాతం పోల్ అయింది. అంటే దాదాపు 55 వేలు ఓటింగ్ జరిగింది. ఇందులో మెజార్టీ పవన్ కళ్యాణ్‌కు పడితే మిగిలిన వర్గాల్లో 90 వేలున్న బీసీలు, 40 వేలున్న ఎస్సీలు, 10 వేలున్న రెడ్లు, 2 వేలున్న ముస్లింలలో మెజార్టీ వంగా గీతకే పడ్డాయనేది అదికార పార్టీ ఆలోచనగా ఉంది.
Also read: Ys Jagan Oath: విశాఖలోనే జగన్ ప్రమాణ స్వీకారం, అధికార పార్టీ ధీమాకు కారణమేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook