Bihar Assembly election 2020: కాంగ్రెస్‌లో చేరిన ఎల్జేడీ చీఫ్ శరద్ యాదవ్ కుమార్తె

బీహార్‌‌లో ఈ నెలాఖరున మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మొదటి విడత ఎన్నికల (Bihar Assembly election 2020) నోటిఫికేషన్ వెలువడటంతోపాటు రాష్ట్రంలో నామినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతోంది. ఈ క్రమంలో రాజకీయ శిబిరాల్లో మార్పులు చేర్పులు జరుగుతుండటంతో.. సర్వతా ఈ అసెంబ్లీ పోరు ఆసక్తికరంగా మారింది.

Last Updated : Oct 14, 2020, 04:06 PM IST
Bihar Assembly election 2020: కాంగ్రెస్‌లో చేరిన ఎల్జేడీ చీఫ్ శరద్ యాదవ్ కుమార్తె

Subhashini Raj Rao joins Congress: న్యూఢిల్లీ: బీహార్‌‌ (Bihar) లో ఈ నెలాఖరున మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మొదటి విడత ఎన్నికల (Bihar Assembly election 2020) నోటిఫికేషన్ వెలువడటంతోపాటు రాష్ట్రంలో నామినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతోంది. ఈ క్రమంలో రాజకీయ శిబిరాల్లో మార్పులు చేర్పులు జరుగుతుండటంతో.. సర్వతా ఈ అసెంబ్లీ పోరు ఆసక్తికరంగా మారింది. తాజాగా లోక్ తాంత్రిక్ జనతాదళ్ (LJD) అధ్యక్షుడు శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి రాజ్ రావు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సుభాషిణి రాజ్ రావు ఢిల్లీలో కాంగ్రెస్ (Congress) తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. Also read: Lalu Prasad Yadav: బీహార్ మాజీ సీఎం లాలూకు బెయిల్.. కానీ

అయితే సుభాషిణి బీహార్ ఎన్నికల్లో బీహార్గంజ్ నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పాడి రాష్ట్రీయ జనతాదళ్ నేతృత్వంలో ఎన్నికల బరిలో దిగాయి. ఈ క్రమంలో శరద్ యాదవ్ కుమార్తె కాంగ్రెస్ పార్టీలో చేరి బీహార్ ఎన్నికల బరిలోకి దిగనుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  Also read: Bihar Assembly Election 2020: మహాకూటమి రథసారధిగా తేజస్వి యాదవ్

ఇదిలాఉంటే.. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్‌ 28, నవంబర్‌ 3,7 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబరు 10న ఫలితాలు వెలువడనున్నాయి. మహాకూటమితోపాటు.. మరోవైపు బీజేపీ, జేడీయూ కలిసి పోటీచేస్తుండగా.. ఇంకా ఇంకా ఎంఐఎం నేతృత్వంలోని థర్డ్ ఫ్రంట్ కూడా బరిలో ఉంది. దీంతోపాటు శివసేన కూడా 50 సీట్లల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే ఎన్డీఏ కూటమిలోని లోక్ జన శక్తి పార్టీ కూడా వేరుగా బీహార్ ఎన్నికల బరిలోకి దిగుతోంది. Also read: Bihar Elections: 50 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఎన్నికలకు దూరంగా ఆ ముగ్గురు నేతలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x