Minister Cleans Toilet: విద్యార్థిని ఫిర్యాదుతో స్కూల్ టాయిలెట్ ను శుభ్రం చేసిన మంత్రి

Minister Cleans Toilet: మధ్యప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్.. గ్వాలియర్ లోని ఓ ప్రభుత్వ పాఠశాల మురుగుదొడ్డిని తానే స్వయంగా శుభ్రం చేశారు. ఓ బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో తాను ఈ పని చేసినట్లు ఆయన మీడియాకు వివరించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2021, 10:05 AM IST
    • మధ్యప్రదేశ్ లో స్కూల్ టాయిలెట్ శుభ్రం చేసిన రాష్ట్రమంత్రి
    • బాలిక ఫిర్యాధు మేరకు శుభ్రం చేసినట్లు వెల్లడి
    • మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ ను ప్రశంసిస్తున్న స్థానికులు
Minister Cleans Toilet: విద్యార్థిని ఫిర్యాదుతో స్కూల్ టాయిలెట్ ను శుభ్రం చేసిన మంత్రి

Minister Cleans Toilet: ఎన్నికల ముందు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నాయకులు రకరకాలు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అలాంటి కార్యాలు ఎన్నికల ముందు తప్ప గెలిచిన తర్వాత చేసిన నాయకులు చరిత్రలో కొంతమందే ఉన్నారు. వారిలో మధ్యప్రదేశ్ కు చెందిన ప్రధుమన్ సింగ్ తోమర్ చేరుతారు. 

మధ్యప్రదేశ్ గ్వాలియర్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని మురుగుదొడ్డిని స్వయంగా శుభ్రం చేసిన ఇంధన శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. మరుగుదొడ్లను శుభ్రం చేసిన తర్వాత పరిశుభ్రత ముఖ్యమని ఆయన సందేశాన్ని ఇచ్చారు. 

"పాఠశాలలోని మరుగుదొడ్లలో పరిశుభ్రత లేదని.. దాని వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒక బాలిక నాతో చెప్పింది" అని మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ మీడియాకు చెప్పారు.

"నేను 30 రోజుల పరిశుభ్రత ప్రతిజ్ఞ చేసాను. నేను ప్రతి రోజు ఏదో ఒక సంస్థకు వెళ్లి శుభ్రం చేస్తాను. ఈ శుభ్రత సందేశం ప్రజలందరికీ చేరాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పట్ల చైతన్యం నింపాలని నేను దీన్ని చేస్తున్నాను" అని ఆయన అన్నారు. 

పరిశుభ్రత పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో పాటు పాఠశాలల్లోని మరుగుదొడ్లను ప్రతిరోజూ శుభ్రంగా ఉంచాలని మున్సిపల్ అధికారులను మంత్రి తోమర్ ఆదేశించారు.  

Also Read: Covavax: కోవావాక్స్​ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్​ఓ ఆమోదం

Also Read: Omicron Cases: భారత్‌లో ఒమిక్రాన్‌ విజృంభన, 109 కి చేరిన కేసులు..జాగ్రత్త అంటోన్న కేంద్రం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News