శాంతికాముడికి ఆగ్రహం వచ్చిన వేళ; మోడీ క్షమాపణులు చెప్పాల్సిందే

Last Updated : Dec 11, 2017, 08:28 PM IST
శాంతికాముడికి ఆగ్రహం వచ్చిన వేళ; మోడీ క్షమాపణులు చెప్పాల్సిందే

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ శాంతికాముడిగా గుర్తింపుపొందిన విషయం తెలిసిందే. ఆయన ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉంటారు. ఎవరినీ విమర్శించకుండా తన పని తాను చేసుకుపోతుంటారు. అయితే ఆయనకు ఉన్నట్టుండి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అసలు వివరాల్లో కి వెళ్లినట్లయితే గుజరాత్ ఎన్ని సమయంలో ప్రధాని మోడీ చేసిన ఆరోపణలపై మన్మోహన్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్  నేతలు పాక్ అధికారులతో చర్చలు జరిపినట్లు మోడీ చేసిన ఆరోపణలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆరోపణలు చేసి  ప్రధాని తన హుందాతనాన్ని కోల్పోతున్నారని విమర్శించారు.

మ‌ణి శంక‌ర్ విందులో ఏం జరిగిందంటే..

రాజకీయ లబ్ధి కోసం మోదీ ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇటీవ‌ల మ‌ణి శంక‌ర్ అయ్య‌ర్ ఇచ్చిన విందులో గుజ‌రాత్ ఎన్నిక‌ల‌పై చ‌ర్చించ‌లేదని స్ప‌ష్టం చేశారు. తాము కేవలం ఇండోపాక్ సంబంధాల గురించి మాత్రమే చర్చించామ‌ని స్ప‌ష్టం చేశారు. 

మోడీ క్షమాపణలు చెప్పాల్సిందే..
మోడీ ఆరోపణలు తనను చాలా బాధించాయని అన్నారు. ఎన్నిక‌ల్లో గెలుపు కోసం ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. రాంగ్రెస్ నేతలు పాక్‌తో కలిసి కుట్ర ప‌న్నారని ఆరోపించిన మోడీ క్షమాపణలు చెప్పాలని మన్హోహన్ డిమాండ్ చేశారు.

 

Trending News