మక్కామసీదు కేసు తీర్పు నేడే; సిటీ పోలీసులు అప్రమత్తం

పదకొండు సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత నేడు మక్కామసీదు పేలుడు కేసులో తీర్పు రానుంది.

Last Updated : Apr 16, 2018, 09:10 AM IST
మక్కామసీదు కేసు తీర్పు నేడే; సిటీ పోలీసులు అప్రమత్తం

పదకొండు సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత నేడు మక్కామసీదు పేలుడు కేసులో తీర్పు రానుంది. హైదరాబాద్ నాంపల్లి ఎన్‌ఐఏ స్పెషల్ కోర్టు, మక్కా పేలుడు కేసులో  సోమవారం తీర్పు వెలువరించనుంది. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో తీర్పు వస్తున్న నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 11 ఏళ్ల క్రితం 2007 మే 18న మధ్యాహ్నం చార్మినార్‌ సమీపంలోని మక్కామసీదు ప్రాంగణంలోని వజూఖానా వద్ద ఐఈడీ బాంబ్ పేలడంతో తొమ్మిది మంది మృతిచెందగా.. 58 మంది గాయపడ్డారు.

పేలుడు సమయంలో మసీదులో ప్రార్థనలు జరుగుతుండటంతో 5 వేల మందికి పైగా ఉన్నారు. పేలుడు తర్వాత జరిగిన అల్లర్లలోనూ ప్రాణనష్టం జరిగింది. అల్లర్లను అణచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో ఐదుగురు మృతిచెందారు. ఈ ఘటనలపై తొలుత హుస్సేనీఆలం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అయితే కేసు తీవ్రత దృష్ట్యా సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఇది ఉగ్రవాద చర్య కావడంతో హోంశాఖ ఈ కేసును పేలుడు జరిగిన నాలుగేళ్ల తర్వాత 2011 ఏప్రిల్‌4న ఎన్‌ఐఏకి అప్పగించింది. ఇక ఈ కేసులో కీలక ఆధారాలు గుర్తించిన ఎన్ఐఏ, నిందితులను గుర్తించడంతో పాటు అభియోపత్రాలను కూడా దాఖలు చేసింది. 11 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు రానుండడంతో తీవ్రఉత్కంఠ నెలకొనింది.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x