ముంబై: 1993 ముంబై పేలుళ్ల కేసులో ధోషులకు టాడా కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో తహీర్ మర్చంట్, ఫిరోజ్ రషీద్ లకు మరణశిక్ష విధించింది. అలాగే అబూ సలేం,కరీముల్లా ఖాన్ లకు జీవిత ఖైదు విధిస్తూ జడ్డి జి.ఎ సనప్ తీర్పు చదవి వినిపించారు. ఈ పేలుళ్లతో సంబంధమున్న రియాజ్ సిద్ధికీ కి పదేళ్ల జైలు శిక్ష విధించారు. తగిన ఆధారాలు లేనికారణంగా మరో నిందితుడు అబ్దుల్ ఖయ్యూంను విడిచిపెట్టారు.కాగా శిక్ష పడ్డ ఐదుగురు దోషులకు కోర్టు 27.09 లక్షల జరిమానా విధించింది. వాస్తవానికి ఈ కేసు సంబంధించి న్యాయస్థానం జూన్ 16న తీర్పు వెలువరించింది. విధ్వంసానికి సంబంధించిన మరో సూత్రధారి అయిన ముస్తఫా దోస్సాతో పాటు వీరంర్నీ కోర్టు దోషులగా తేల్చింది. తీర్పు వెలువడిన రెండు రోజులకే ముస్తఫా ముంబైలోని జె.జె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో మిగిలిన ఐదుగురికి శిక్ష ఖరారు చేస్తూ గురువారం టాడా కోర్టు తీర్పు వెలవరించింది.
1993 మార్చి 12న ముంబైలో 2 గంటల వ్యవధిలో 12 చోట్ల వరస బాంబు పేలుళ్ల సంభవించాయి. ఈ విధ్వంసకాండలో 257 మంది అమయకులు మరణించారు. 700 మందికిపైగా గాయాలపాయ్యారు. కాగా ఈ పేలుళ్లతో 129 మంది నిందితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన తొలి దశ విచారణ 2006లో పూర్తయింది. మొత్తం 100 మంది దోషులుగా తేల్చుతూ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే యాకుబ్ మెమెన్ మినహా మిగిలిన వారికి శిక్ష తగ్గిస్తూ సుప్రీంకోర్టు 2013లో తీర్పు వెలువరించింది. 2015 జూలై 30న యాకుబ్ కు ఉరిశిక్ష అమలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న దావుద్ ఇబ్రహీం, టైగర్ మెమెన్, అనీస్ ఇబ్రహీంలతో సహా మరికొందరు ఇంకా పరారీలో ఉన్నారు