Navjot sidhu surrenders: కోర్టులో లొంగిపోయిన సిద్దూ

Navjot sidhu surrenders: పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ పాటియాలా కోర్టు ముందు లొంగిపోయారు.1988 నాటి గొడవ కేసులో సిద్దూకు సుప్రీం కోర్టు తాజాగా ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. అయితే తన వైద్య వ్యవహారాల నిర్వహణ నిమిత్తం తనకు లొంగిపోయేందుకు కొన్ని వారాల సమయం కావాలని సిద్దూ తన న్యాయవాది ద్వారా శుక్రవారం ఉదయం కోర్టును అభ్యర్థించారు. అయితే సాయంత్రానికి పాటియాలా కోర్టులో లొంగిపోయారు.

Written by - Attili | Edited by - Attili | Last Updated : May 29, 2022, 06:31 PM IST
  • కోర్టులో లొంగిపోయిన సిద్దూ
  • ఏడాది పాటు జైలు శిక్ష విధించిన సుప్రీం కోర్టు
  • సుప్రీం ఆదేశాలతో లొంగిపోయిన సిద్దూ
Navjot sidhu surrenders: కోర్టులో లొంగిపోయిన సిద్దూ

Navjot sidhu surrenders: పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ పాటియాలా కోర్టు ముందు లొంగిపోయారు.1988 నాటి గొడవ కేసులో సిద్దూకు సుప్రీం కోర్టు తాజాగా ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. అయితే తన వైద్య వ్యవహారాల నిర్వహణ నిమిత్తం తనకు లొంగిపోయేందుకు కొన్ని వారాల సమయం కావాలని సిద్దూ తన న్యాయవాది ద్వారా శుక్రవారం ఉదయం కోర్టును అభ్యర్థించారు. అయితే సాయంత్రానికి పాటియాలా కోర్టులో లొంగిపోయారు.

చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు సిద్ధు లొంగిపోయినట్లు ఆయన మీడియా సలహాదారు సురీందర్ దల్లా వెల్లడించారు. సిద్దూను జ్యుడీషియల్ కస్టడీలో తీసుకున్న అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు.

అప్పుడేం జరిగింది

1988 డిసెంబర్ 27న గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిపై సిద్దూ దాడి చేయడంతో అతడు మరణించారు. సిద్దూ రోడ్డు మధ్యలో తన జిప్సీ వాహనాన్ని నిలపడంతో... గుర్నామ్ సింగ్ దాన్ని తొలగించాలన్నారు. మాటా మాటా పెరగడంతో గొడవ పెద్దదైంది. ఈ ఘర్షణలో గుర్నామ్‌ సింగ్ మరణించడంతో అతడి కుటుంబ సభ్యులు కోర్టులో కేసు వేశారు.

34 ఏళ్ల తర్వాత..

ఈ కేసులో దాదాపు 34 ఏళ్ల తర్వాత సుప్రీం కోర్టు .. తాజాగా సిద్దూకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే కేసు విచారణ అనేక మలుపులు తిరిగింది. తగిన ఆధారాలు లేవంటూ 1999 సెప్టెంబర్ 22న పాటియాల కోర్టు సిద్దూను నిర్దోషిగా ప్రకటించింది. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు హరియాణా పంజాబ్ హైకోర్టును ఆశ్రయించారు. 2006లో పంజాబ్‌ హైకోర్టు ఈ కేసులో సిద్దూను దోషిగా ప్రకటించి 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

పంజాబ్ హైకోర్టు తీర్పుపై సిద్దూ సుప్రీం కోర్టుకు వెళ్లారు. 2018లో సుప్రీం త్రిసభ్య ధర్మాసనం సిద్దూను నిర్దోషిగా ప్రకటించి.. వెయ్యి రూపాయల జరిమానాతో సరిపెట్టింది. ఈ తీర్పుపై గుర్నామ్ కుటుంబ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. మార్చి 25న వాదనలు ముగించిన సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్ లో పెట్టింది. తాజాగా ఏడాది పాటు జైలు శిక్ష ఖరారు చేసింది.

సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే సిద్దూ స్పందించారు. కోర్టు తీర్పునకు కట్టుబడి ఉంటానని ట్వీట్ చేశారు.

Also Read:Elon Musk Issue:ఎలాన్ మస్క్‌పై ఇన్‌సైడర్ సంచలన కథనం..విషయం ఏంటి..?

Also Read: Vikram Telugu Trailer: పదా చూస్కుందాం.. సూర్యోద‌యాన్ని చూడ‌బోయేది ఎవ‌రో! విక్ర‌మ్ తెలుగు ట్రైల‌ర్‌ అదుర్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News