Telangana Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కుమ్మేస్తోంది. దక్షిణ తెలంగాణలో కుండపోతగా వర్షం కురుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి. మేడ్చల్ మల్కాజ్ గిరి, సంగారెడ్డి, వికారాబాద్. ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా 134 సెంటిమీటర్ల వర్షం కురిసింది, వికారాబాద్ జిల్లా బొమ్మరాసపేట 121, రంగారెడ్డి జిల్లా యాచారంలో 107, మేడ్టల్ జిల్లా ఆల్వాల్ లో 106, నాగర్ కర్నూల్ జిల్లా ఊకొండి 95లో , గద్వాల జిల్లా గట్టు 95, ఐజలో 95, సంగారెడ్డి జిల్లా జిన్నారం 90, గ్రేటర్ పైదరాబాద్ పరిధిలోని ఎల్పీ నగర్ లో 87 సెంటిమీటర్ల వర్షం కురిసింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆల్వాల్ లో 106, సరూర్ నగర్ 88, డబీర్ పురా 83, తిరుమలగిరి 78, రాజేంద్రనగర్ 77, మలక్ పేట 75, కుత్బుల్లాపూర్ షాపూర్ నగర్ 75, గాజుల రామారాం 72, ఘాన్సీ బజార్ 72, అస్మాన్ ఘడ్ 69, కుత్బుల్లాపూర్ 67, కిషన్ బాగ్ 66, కుర్మగూడ 63, బాలానగర్ 60 సెంటిమీటర్ల వర్షం కురిసింది.
కుండపోత వానకు హైదరాబాద్ లో వరద పోటెత్తింది. పాతబస్తీతో పాటు కుత్పుల్లాపూర్ పరిధిలోని పలు కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. మలక్ పేట సర్కిల్ లోని పలు కాలనీలు జలమయంఅయ్యాయి. మూసి నది ఉప్పొంగడంతో ఛాదర్ ఘాట్ వద్ద ఉధృతంగా ప్రవహించింది. మూసారాంబాగ్ వంతెన పై నుంచి మూసీ ప్రవహించడంతో .. బ్రిడ్జి పై నుంచి రాకపోకలు నిలిపివేశారు.
Also Read: Chiranjeevi - Pawan Kalyan: ఒకే స్టేజ్‌పై చిరంజీవి, పవన్ కల్యాణ్.. అభిమానులకు పండగే ఇగ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి