దిశ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం.. ప్రభుత్వాలకు నోటీసులు

దిశ అత్యాచారం, దారుణ హత్య ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మరోసారి సీరియస్ అయింది. మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాల్సిందిగా కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నోటీసులు జారీచేసింది.

Last Updated : Dec 3, 2019, 11:20 AM IST
దిశ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం.. ప్రభుత్వాలకు నోటీసులు

న్యూ ఢిల్లీ: దిశ అత్యాచారం, దారుణ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ మరోసారి ఈ తరహా ఘటనలపై స్పందించింది. మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై ఎన్‌హెచ్ఆర్‌సి(NHRC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల ఘటనలపై మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ తరహా నేరాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. అంతే కాదు.. ప్రభుత్వాలు, పోలీసుల నిర్లక్ష్యం వల్లే అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని కమిషన్ అసహనం వ్యక్తంచేసింది. అత్యాచారాలు, మహిళలపై దాడులు జరగకుండా వారి భద్రత కోసం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకు NHRC నోటీసులు జారీచేసింది.

Trending News