'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. కరోనా వైరస్ లొంగిరాకపోవడంతో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఉత్తర ప్రదేశ్ సర్కారు మరో కఠిన నిర్ణయం తీసుకుంది.
లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్న యూపీ సర్కారు మరో అడుగు ముందుకేసింది. కరోనా వైరస్ లాక్ డౌన్ పాటిస్తూనే జూన్ 30 వరకు ప్రజలు ఎక్కువగా గుమికూడకుండా చూడాలని నిర్ణయించింది. ప్రజలు గుంపులుగా ఉండడాన్ని నిషేధించింది. జూన్ 30 నాటికి మళ్లీ పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటారు.
ప్రస్తుతం రంజాన్ మాసం మొదలైంది. ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు ఎలాంటి అనుమతి లేదు. రాష్ట్రవ్యాప్తంగా మసీదులు మూసివేసి ఉంచారు. ఒకవేళ సామూహిక ప్రార్థనల కోసం అంతా బయటకు వస్తే పరిస్థితి దిగజారే అవకాశం ఉంటుంది. కాబట్టి గుంపులు గుంపులుగా ప్రజలు ఒక్కచోటకు చేరడాన్ని నిషేధించినట్లుగా తెలుస్తోంది.
లాక్ డౌన్ నిబంధనలను పాటించడంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చాలా కఠినంగా ఉన్నారు. ఆయన తన తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. ఉత్తరాఖండ్ లో ఉన్న తండ్రి పార్ధీవ దేహాన్ని చూసేందుకు ఆయన నోచుకోలేదు.
మరోవైపు ఉత్తరప్రదేశ్ లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 1621 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 25 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ఉత్తరప్రదేశ్‌లో మరో కఠిన నిర్ణయం..!!