కోలకతా: పశ్చిమ బెంగాల్లోని బంకుర జిల్లా సరేంగా ప్రాంత పరిధిలో ఉన్న ఏడు లక్షల లీటర్లు సామర్థ్యమున్న భారీ వాటర్ ట్యాంకు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ వాటర్ ట్యాంకును 2016లో నిర్మించారు. దీనికి పగుళ్లు వచ్చి, కూలిపోయే దశకు చేరుకున్న అధికారులు పట్టించుకోలేదని స్థానికులనుండి విమర్శలు వస్తున్నాయి. బుధవారం ట్యాంకు కుప్పకూలిపోవడంతో లక్షల లీటర్ల నీరు వృథాగా అయిపోయింది. ఎన్నో సార్లు స్థానికుల నుండి పిర్యాదులు వచ్చినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
ఈ వాటర్ ట్యాంకు ద్వారా దాదాపు 15 గ్రామాలకు తాగునీరు సరఫరా అయ్యేదని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఒక్కసారిగా ట్యాంకు కూలిపోవడంతో చుట్టపక్కల ఉన్న గ్రామాల ప్రజలు త్రాగునీటి కొరకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. ట్యాంక్ నిర్మించిన నాలుగేండ్లకే కూలిపోవడంపై, ట్యాంక్ నిర్మాణంలో నాణ్యత లోపించడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. దీంతో నిర్మాణ పనులపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీళ్ల ట్యాంకు కూలిపోవడానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని అధికారులు అంటున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..