కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల

కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల

Last Updated : Oct 13, 2018, 09:27 AM IST
కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి పతనం వంటి ప్రభావాలు దేశీయంగా పెట్రో ఉత్పత్తులపై కనిపిస్తోంది.

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ 18 పైసలు, డీజిల్‌పై 29 పైసలు పెరిగాయి. ధరలు పెరిగిన అనంతరం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.82.66, డీజిల్‌ రూ.75.19గా ఉంది. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌పై 18 పైసలు, డీజిల్‌పై 31 పైసలు పెరిగాయి. దీంతో ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.88.12, డీజిల్‌ రూ.78.82లుగా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.84. 48, లీటర్ డీజిల్ రూ.77.04గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.85.92, లీటర్ డీజిల్ రూ.79.51గా ఉంది.

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ 19 పైసలు, డీజిల్‌ 32 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.87.63, డీజిల్‌ రూ.81.79గా ఉంది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.86.87, డీజిల్‌పై రూ.80.65గా ఉంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు తెలిపాయి.

 

 

Trending News