మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు !

ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపించిన ఇంధనం ధరల్లో మళ్లీ క్రమక్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో భారత్‌లోని వివిధ నగరాల్లో శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ స్వల్ప పెరుగుదల చోటుచేసుకుంది.

Last Updated : Jan 11, 2019, 03:28 PM IST
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు !

న్యూఢిల్లీ: ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపించిన ఇంధనం ధరల్లో మళ్లీ క్రమక్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో భారత్‌లోని వివిధ నగరాల్లో శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ స్వల్ప పెరుగుదల చోటుచేసుకుంది. శుక్రవారం లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు 18 - 32 పైసల వరకు పెరిగాయి. శుక్రవారం నాటి ధరల సవరణ అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.69.07 కాగా లీటల్ డీజిల్ ధర రూ.62.81 గా వుంది. హైదరాబాద్‌లో నేడు లీటర్ పెట్రోల్ ధర రూ.73.27 కాగా లీటర్ డీజిల్ ధర 68.28 గా ఉన్నట్టు ప్రభుత్వరంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేర్కొంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.72.75 కాగా లీటల్ టీజిల్ ధర రూ.75.50 గా వుంది. 

ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు పెరిగి రూ.74.72 కి చేరింది. ఇక డీజిల్ విషయానికొస్తే, గరిష్టంగా లీటర్ డీజిల్ ధర 30 పైసలు పెరిగి అంతిమంగా రూ.65.73 కి చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.71.67 కాగా లీటర్ డీజిల్ ధర రూ.66.31 గా ఉంది. ఇక మరో మెట్రో నగరమైన కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 71.20 కాగా లీటల్ డీజిల్ ధర రూ. 64.58 గా ఉంది.

Trending News