PM Modi Birthday special: సెప్టెంబర్ 17 ప్రధాని నరేంద్ర మోదీ బర్త్ డే కావడంతో ఆయన పుట్టిన రోజును మరింత స్పెషల్ చేసేందుకు భారతీయ జనతా పార్టీ ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటోంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోని బీజేపి రాష్ట్ర అధ్యక్షులకు, పార్టీ కార్యవర్గానికి బీజేపీ హై కమాండ్ నుండి ఆదేశాలు వెళ్లాయి. ప్రధాని మోదీ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడంతో పాటు ఆ ఈవెంట్స్, ఫోటోస్, వీడియోలు నమో యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సిందిగా పార్టీ హైకమాండ్ బీజేపి నేతలకు సూచించింది. అంతేకాకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ వాటిని పోస్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. సేవాపక్షం పేరుతో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు రెండు వారాల పాటు ప్రధాని మోదీ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించాలని బీజేపి నిర్ణయించింది.
ప్రధాని మోదీ చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు, గొప్ప గొప్ప ఇనిషియేటివ్స్‌కి సంబంధించిన విషయాలను తెలిపేలా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిల్లో ఎగ్జిబిషన్ కార్యక్రమాలు చేపట్టాలని బీజేపి హై కమాండ్ పార్టీ నేతలకు సూచించింది. బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేరకు నేతలకు క్లియర్‌కట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు.
టీబీ పేషెంట్‌ని దత్తత తీసుకోండి
అన్ని ప్రాంతాల్లోనూ ప్రతీ వార్డుకు ఒకరి చొప్పున టీబీ పేషెంట్స్ ని ఏడాది పాటు దత్తత తీసుకుని, వారికి అవసరమయ్యే చికిత్స, ఇతర వైద్య సహాయం, జీవనాధారం వంటి బాధ్యతలు చూసుకోవాల్సిందిగా బీజేపి నేతలకు సూచించింది. 2025 లోగా దేశంలో టీబీ నిర్మూలనకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని.. ఇలా ఒక టీబీ పేషెంట్ ని దత్తత తీసుకోవడం ద్వారా ప్రధాని మోదీ ఆశసాధనలో భాగస్వాములు కావాల్సిందిగా బీజేపి తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేసింది.
భిన్నత్వంలో ఏకత్వం.. ఏక్ భారత్, శ్రేష్ట భారత్..
భిన్నత్వంలో ఏకత్వంను ప్రోత్సహిస్తూ ఒక్క రోజు పాటు మరో రాష్ట్రం వారి ఆచార వ్యవహారాలు, ఆహార పద్ధతులు, వస్త్రాలంకరణ వంటి పద్ధతులను అనుసరించాల్సిందిగా బీజేపి హై కమాండ్ పార్టీ నేతలకు సూచించినట్టు తెలుస్తోంది.
వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద ప్రత్యేక శిబిరాలు
గతేడాది ఇదే రోజున ప్రధాని మోదీ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రత్యేక కార్యక్రమంతో ఒక్క రోజులోనే అత్యధిక సంఖ్యలో పౌరులు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న దేశంగా భారత్ రికార్డు సొంతం చేసుకుంది. అదే పద్దతిలో ఈ ఏడాది కూడా వ్యాక్సినేషన్ క్యాంప్స్ వద్ద పౌరులకు సహాయపడాల్సిందిగా బీజేపి తమ నేతలకు సూచించింది.
వోకల్ ఫర్ లోకల్ నినాదం..
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యసాధనలో భాగంగా వోకల్ ఫర్ లోకల్ స్టోరీలను షేర్ చేయాల్సిందిగా హై కమాండ్ బీజేపి నేతలకు సూచించింది. అలా అప్‌లోడ్ చేసిన వారిలో 10 మంది బెస్ట్ డిస్ట్రిక్ ప్రెసిడెంట్స్‌ని ఎంపిక చేసి అవార్డులతో సత్కరించనున్నారు.
బుక్స్ ఎగ్జిబిషన్
దేశాభివృద్ధి కోసం ప్రధాని మోదీ తీసుకున్న చర్యలు, ఇతర ప్రణాళికలపై ప్రచురించిన పుస్తకాలతో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాల్సిందిగా పార్టీ నేతలకు ఆదేశాలు అందినట్టు సమాచారం. అంతేకాకుండా మోదీ @20 సప్నే హుయే సాకార్ అనే పుస్తకానికి ప్రచారం కల్పించేలా స్ట్రాటెజీ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
బ్లడ్ డొనేషన్, హెల్త్ చెకప్ క్యాంప్స్..
దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జిల్లా స్థాయిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, హెల్త్ చెకప్ క్యాంప్స్ నిర్వహించాల్సిందిగా బీజేపీ యువ మోర్చకు ఆదేశాలు వెళ్లాయి. అంతేకాకుండా 10 బెస్ట్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, హెల్త్ చెకప్ క్యాంప్స్‌కి అవార్డులు కూడా అందించనున్నారు. హెల్త్ చెకప్ క్యాంప్స్ ద్వారా వికలాంగులకు కృత్రిమ కాలు పరికరాలు అందించాల్సిందిగా బీజేపి యువ మోర్చ నేతలకు సూచించింది.
చెట్లు నాటే కార్యక్రమం
బూత్ స్థాయిలో చెట్లు నాటే కార్యక్రమంతో పాటు పరిసరాల పరిశుభ్రం అవగాహన కల్పిస్తూ చేపట్టే వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అప్‌లోడ్ చేయడంతో పాటు నమో యాప్‌లోనూ అప్‌లోడ్ చేయాల్సిందిగా హై కమాండ్ సూచించింది.
మహాత్మా గాంధీ భోదనలకు ప్రచారం
మన జాతి పిత మహాత్మా గాంధీ జయంతి కూడా సమీపిస్తున్న నేపథ్యంలో గాంధేయ వాదంతో ఆ మహాత్ముడు బోధించిన పాఠాలను పౌరులకు తెలియజెప్పి గాంధీ ఆశయసాధనకు కృషి చేసే విధంగా బీజేపి ఈవెంట్స్ ప్లాన్ చేసుకుంటోంది.
Also Read : 17th September 2022: తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల కోసం హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా
Also Read : BJP VS TRS: అమిత్ షాకు షాకిచ్చిన టీఆర్ఎస్.. సెప్టెంబర్17న రచ్చ రచ్చేనా?
Also Read : September 17th: తెలంగాణలో 17న ఏం జరగబోతోంది..? కిషన్‌రెడ్డి, అసదుద్దీన్ కీలక ప్రకటనలు
Also Read : Telangana Vimochana Dinotsavam 2022: తెలంగాణ విమోచన దినోత్సవం.. ఈసారి కేంద్రం చేతుల మీదుగా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి