Jagan: అఖిల్ కి కాబోయే భార్య ఫ్యామిలీకి.. వైయస్ జగన్ కి ఉన్న సంబంధం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Zainab relation to Jagan: అక్కినేని నాగార్జున.. తనకు కాబోయే రెండో కోడలు గురించి ఈరోజు.. ట్విట్టర్ వేదికగా ప్రకటించిన.. సంగతి తెలిసిందే.యువ జంటను అభినందించండి అని కోరుతూ.. అక్కినేని నాగార్జున ట్వీట్‌ చేసారు. ఈ క్రమంలో అక్కినేని కి కాబోయే రెండో కోడల గురించి.. ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Written by - Vishnupriya | Last Updated : Nov 26, 2024, 09:59 PM IST
Jagan: అఖిల్ కి కాబోయే భార్య ఫ్యామిలీకి.. వైయస్ జగన్ కి ఉన్న సంబంధం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

How Akhil Fiance related to Jagan: అక్కినేని ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది. కొద్ది రోజుల్లో నాగార్జున మొదటి కొడుకు నాగ చైతన్య పెళ్లి ఉండగా.. ఇప్పుడు నాగార్జున రెండో కొడుకు అక్కినేని అఖిల్ నిశ్చితార్థం జరిగిపోయింది. నేడు హైదరాబాద్ లో నాగార్జున ఇంట్లో ఘనంగా ఈ నిశ్చితార్థం జరిగింది. 

Add Zee News as a Preferred Source

ఈరోజు ఉదయం ఓ శుభ ముహూర్తాన ప్రముఖ ఆర్టిస్ట్ ‘జైనాబ్ రవద్జీతో ‘ చేతికి ఎంగేజ్ మెంట్ రింగ్ తొడిగాడు అఖిల్. ఇందుకు సంబంధించిన ఫోటోలు నాగార్జున ట్విట్టర్లో షేర్ చేస్తూ మరి యువజంటను ఆశీర్వదించండి అని కోరారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యాయారు. 

ఈ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో అఖిల్కి కాబోయే భార్య గురించి కూడా ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. అఖిల్ కి కాబోయే భార్య స్కిన్ కేర్ అడ్వైజర్ అని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కొన్ని మీడియా ఛానల్స్ లో మాత్రం తిను ఒక ఆర్టిస్ట్ అని చెప్పుకొస్తున్నారు.

ఇక అన్నిటికన్నా ముఖ్యంగా జైనాబ్ రావ్డ్జీ తండ్రి గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అఖిల్ కి కాబోయే మామ జగన్ కి చాలా క్లోజ్ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. 

జైనాబ్ రావ్‌డ్జీ  తండ్రి జుల్ఫీ రావ్‌డ్జీ AP మాజీ సీఎం #YS జగన్, నాగార్జునలకు సన్నిహిత వ్యాపార స్నేహితుడు అని.. అతను వైఎస్‌జగన్‌కు కొద్ది రోజులు సలహాదారుగా పనిచేశాడు అనే ఒక వార్త తెగ వినిపిస్తోంది.

Read more: Tirumala: తిరుమలలో షాకింగ్ ఘటన.. శ్రీవారికే శఠగోపం పెట్టిన కేటుగాడు.. ఏంచేశాడో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News