PM Surya Ghar Scheme: ప్రధానమంత్రి సూర్య ఘర్ పధకం అంటే ఏమిటి, ఎలా అప్లై చేయాలి

PM Surya Ghar Scheme: మీ ఇంటిపై లేదా గ్రూప్ హౌసింగ్ లేదా అపార్ట్‌మెంట్‌పై సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు ఇకపై ప్రభుత్వం కూడా తోడ్పాటు ఇవ్వనుంది. అందుకు అవసరమైన సబ్సిడీ కూడా ఇస్తుంది. అదే సూర్య ఘర్ పథకం. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 2, 2024, 11:47 AM IST
PM Surya Ghar Scheme: ప్రధానమంత్రి సూర్య ఘర్ పధకం అంటే ఏమిటి, ఎలా అప్లై చేయాలి

PM Surya Ghar Scheme: చాలామంది తమ ఇళ్లు లేదా ఆఫీసులపై సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటుంటారు. కానీ అదంతా సొంత ఖర్చుతో. ఇకపై కేంద్ర ప్రభుత్వం ఈ తరహా సోలార్ వ్యవస్థకు సబ్సిడీ అందించనుది. ఇందులో భాగంగా పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పధకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 

ఇంటి పైకప్పులపై సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందించనుంది. 2023-24 నుంచి 2026-27 వరకూ నాలుగేళ్లు నడిచే పధకం పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం. ప్రధాని మోదీ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ఇందుకు సంబంధించి ఆమోదం లభించింది. ఈ పధకంలో సబ్సిడీ రెండు భాగాలుగా ఉంటుంది. 2 కిలోవాట్ల సామర్ధ్యానికి 60 శాతం సబ్సిడీ ఇవ్వనుండగా, 2 కిలోవాట్ల కంటే ఎక్కువ ఉంటే 40 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. అంటే 3 కిలోవాట్ల సోలార్ వ్యవస్థకు మొత్తం ఖర్చు 1.40 లక్షలు కాగా కేంద్ర ప్రభుత్వం 78 వేలు సమకూరుస్తుంది. మిగిలిన మొత్తాన్ని స్యూరిటీ లేకుండా బ్యాంకులు ఇస్తాయి. 

ఇళ్లపై ఏర్పాటు చేసుకునే సోలార్ వ్యవస్థతో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో మొదటి 300 యూనిట్లు ఉచితంగా వినియోగించుకోవచ్చు. మిగిలిన 600 యూనిట్లను నెట్ మీటర్ విధానం ద్వారా విక్రయించవచ్చు. దాంతో నెలకు 1265 రూపాయల ఆదాయం సమకూరుతుంది. ఈ ఆదాయంలో బ్యాంకుల రుణ వాయిదా కింద 610 జమ చేసుకోగా మిగిలింది లబ్దిదారుడికి ఉంటుంది. 1 కిలోవాట్ కు 30 వేలు, 2 కిలోవాట్లకు 60 వేలు 3 కిలోవాట్లకు గరిష్టంగా 78 వేలు రాయితీ లభిస్తుంది. 

మన వినియోగాన్ని బట్టి ఎన్ని కిలోవాట్ల సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలనేది నిర్ణయమౌతుంది. నెలకు 0-150 యూనిట్ల విద్యుత్ వినియోగించేవారికి 1-2 కిలోవాట్ల సోలార్ వ్యవస్థ సరిపోతుంది. అదే నెలకు 150-300 యూనిట్ల వినియోగం ఉంటే 2-3 కిలోవాట్ల సోలార్ వ్యవస్థ ఏర్పాటుచేసుకోవాలి. నెలకు 300 యూనిట్లు దాటితే 3 కిలోవాట్లు తప్పనిసరి. 3 కిలోవాట్లకు మించి ఏర్పాటు చేసుకున్నా సబ్సిడీ మాత్రం 78 వేలే వస్తుంది. నివాసితుల సంక్షేమ సంఘాలు, బృందాలుగా ఉండేవారు కూడా కంబైన్డ్ ఎలక్ట్రిసిటీ వినియోగం కోసం550 కిలోవాట్ల వరకూ సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికోసం  కిలోవాట్‌కు 18 వేల రాయితీ లభిస్తుంది. 

పీఎం సూర్య ఘర్‌కు ఎలా అప్లై చేసుకోవాలి.

ముందుగా పీఎం సూర్య ఘర్ పోర్టల్ pmsuryaghar.gov.in పేరు రిజిస్టర్ చేసుకోవాలి. మీ రాష్ట్రాన్ని, విద్యుత్ సరఫరా సంస్థను ఎంచుకోవాలి. విద్యుత్ కనెక్షన్ కన్జ్యూమర్ నెంబర్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి. ఇప్పుడీ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అయి సూర్య ఘర్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత డిస్కమ్ నుంచి అనుమతి వచ్చేవరకు నిరీక్షించాలి. అనుమతి లభించాక డిస్కమ్ రిజిస్టర్డ్ విక్రేత్నించి సోలార్ ప్లాంట్ కొనుగోలు చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ ముగిసిన తరువాత సంబంధిత వివరాలు మరోసారి పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేయాలి. నెట్ మీటర్ ఇన్‌స్టాల్ పూర్తయ్యాక డిస్కమ్ అధికారులు తనిఖీ చేసి పోర్టల్ నుంచి కమీషనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ తరువాత మీ బ్యాంక్ ఎక్కౌంట్ వివరాలు ఇస్తే నెలరోజుల్లో మీ సబ్సిడీ మీకు అందుతుంది. 

Also read: 8th Pay Commission Updates: ఉద్యోగులకు షాక్, 8వ వేతన సంఘం లేనట్టేనా, కారణాలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News