కర్ణాటక తీర్పు: ఫలితాలపై రాజకీయ నేతల స్పందన

తాజా ఎన్నికల విజయంతో బీజేపీ పాలిత రాష్ట్రాల జాబితాలో కర్ణాటక చేరింది.

Last Updated : May 15, 2018, 04:59 PM IST
కర్ణాటక తీర్పు: ఫలితాలపై రాజకీయ నేతల స్పందన

బీజేపీ పాలిత రాష్ట్రాల జాబితాలో కర్ణాటక చెరనుంది. దీంతో దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల సంఖ్య 21కి చేరనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్, మిజోరాం రాష్ట్రాలలో మాత్రమే బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. తాజా ఫలితాలపై దేశంలో ఉన్న రాజకీయ నేతలు ఇలా స్పందించారు. 

  • కర్ణాటకలో బీజేపీ విజయం సాధించడానికి కాంగ్రెస్ పార్టీ స్వయం కృతాపరాథమే కారణం.  ఒక వేళ కాంగ్రెస్ జేడీఎస్ తో పొత్తు పెట్టుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేది- మమతా బెనర్జీ
  • 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఆపడం ఎవరితరం కాదు. కర్ణాటకలోని తెలుగు ఓటర్లు బీజేపీకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. కర్ణాటకలో విజయంతో బీజేపీ ఉత్తర భారతదేశ పార్టీ అనే అపోహ తొలగింది. మోదీ నాయకత్వాన్ని యావత్‌ దేశం బలపరుస్తోంది.-  కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు
  • కర్నాటక అసెంబ్లీ ఎన్నికల విజయంతో దక్షిణాదిలో బీజేపీ జైత్రయాత్ర ప్రారంభమైంది. రానున్న రోజులలో ఏపీతో సహా దేశంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. 2019 ఎన్నికలలో ఏపీలో తెలుగుదేశం పార్టీ పరాజయం తథ్యం.- బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
  • కర్ణాటక ప్రజలు సుపరిపాలన కోసం బీజేపీకి ఓటేశారు. పార్టీకి ఇది చాలా ఘన విజయం. కాంగ్రెస్‌ పార్టీ ఒక రాష్ట్రం తరువాత మరొక రాష్ట్రాన్ని కోల్పోతోంది. తాము ఒక రాష్ట్రం తరువాత మరొక రాష్ట్రంలో విజయం సాధిస్తూ ముందుకు పోతున్నాం. -కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌
  • చంద్రబాబు చిల్లర రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు. కర్నాటక ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. కర్నాటకలో బీజేపీని ఓడించాలని ఏపీ సీఎం చంద్రబాబు శతధా ప్రయత్నించారు. తెలుగువారు అదికంగా ఉండే ప్రాంతంలో కూడా బీజేపీ అభ్యర్థులే విజయం సాధించారు. -బీజేపీ నాయకుడు రాంమాధవ్
  • కాంగ్రెస్‌ విభజన రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారు. అభివృద్ధికి ఓటు వేసిన కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు. కాంగ్రెస్‌ విభజన రాజకీయాలకు ప్రజలు మద్దతు ఇవ్వలేదు. కర్ణాటకలో ప్రధాని మోదీ ప్రచారం మంచి ఫలితాలనిచ్చింది- కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్
  • ప్రధాని మోదీపై నమ్మకంతోనే కర్ణాటక ప్రజలు బీజేపీని గెలిపించారు. కర్ణాటకలోని గ్రామీణ, నగర ప్రజలు బీజేపీకు అండగా నిలిచారు. కర్ణాటకను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాము- కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌
  • కర్నాటకలో బీజేపీ విజయాన్ని శుభపరిణామం. దేశం మొత్తం మోదీ పాలననే కోరుకుంటోందని ఈ విజయం ద్వారా మరోసారి స్పష్టమైంది. కర్నాటకలో బీజేపీ విజయాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోర్యాలీ నిర్వహించనున్నాము- బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
  • కాంగ్రెస్‌ పార్టీ లింగాయత్‌లను చీల్చి ఆత్మహత్య చేసుకుంది. వరుస ఓటములను జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ ఈవీఎంల ట్యాంపరింగ్‌ ఆరోపణలను చేస్తోంది.- బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి
  • కర్ణాటక శాసనసభకు జరిగిన ఎన్నికల ఫలితాలు మొత్తం విడుదలైన తరువాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తాను. తమ పార్టీ ఎవరికి మద్దతు ప్రకటిస్తుందనే విషయమై తాను ఇప్పుడే ఏమీ మాట్లాడబోను-  జెడిఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ
  • అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాజకీయాల నుంచి రిటైర్ అవుదామనుకున్నా. పార్టీ నేతల ఒత్తిడితోనే పోటీకి దిగాను. తాను ఒక స్థానంలో విజయం సాధించడం, మరో స్థానంలో పరాజయం పాలవ్వడం పెద్ద ముఖ్యం కాదు- సీఎం సిద్ధరామయ్య
  • ఈ విజయం పార్టీ కార్యకర్తలది. కర్ణాటక ప్రజలు ధన్యవాదాలు- యుపీ సీఎం ఆదిత్యనాథ్
  • ఈ విజయంతో కాంగ్రెస్ వ్యతిరేకత ఎంత ఉందొ తెలుస్తోంది. 2019లో లోక్సభ ఎన్నికల్లో మాదే విజయం- కేంద్రమంత్రి గడ్కరీ

Trending News