హుందాతనాన్ని చాటుకున్న భారత రాష్ట్రపతి

Last Updated : Oct 9, 2017, 11:28 AM IST
హుందాతనాన్ని చాటుకున్న భారత రాష్ట్రపతి

దేశ ప్రథమ పౌరుడిగా భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ రోజు తన హుందాతనాన్ని చాటుకున్నారు. తన మీద పడుతున్న వానను సైతం లెక్కచేయకుండా గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ సమయంలో తనకు గొడుగు పట్టేందుకు వచ్చిన అధికారులను ఆయన సున్నితంగా నిరాకరించారు. వర్షంలో తడుస్తూనే తన గార్డ్ ఆఫ్ హానర్‌ను స్వీకరించారు. ఆదివారం నాడు రాష్ట్రపతి తొలిసారిగా కేరళకు పర్యటన నిమిత్తం వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది. ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి విమానాశ్రయం దగ్గరకు వస్తున్నప్పుడు వర్షం జోరుగా పడసాగింది. అదే సమయంలో ఆయన తనకు గౌరవ వందనాన్ని అందించడానికి
వస్తున్న వారి కోసం వర్షంలో ఉండడానికే ఆయన మొగ్గుచూపారు.  రాష్ట్రపతి విమానాశ్రయం వద్దకు చేరుకోగానే కేరళ గవర్నర్ పి.సదాశివన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రత్యేక స్వాగతం పలికారు. అదే సమయంలో వాన కురుస్తున్నప్పుడు,  భద్రతాధికారులు గొడుగు పట్టడానికి ప్రయత్నించగా, రాష్ట్రపతి వారిని వారించారు. వానలోనే తడుస్తూ డయాస్‌ మీద నుంచొని గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఒక ఛారిటీ కార్యక్రమంలో పాల్గొనడానికి హెలికాప్టర్‌లో కొల్లాం బయలుదేరారు.

 

 

Trending News