Chandigarh University: పంజాబ్ మొహాలీ (Mohali)లోని చండీగఢ్ యూనివర్సిటీ (Chandigarh University)లో శనివారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బాలికల హాస్టల్‌లో విద్యార్థినులు స్నానం చేస్తుండగా ఓ యువతి వీడియో తీసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాలికల బాత్ వీడియోలు (girls bath video) ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కావడంతో వారిలోని 8 మంది విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే...
చండీగఢ్ యూనివర్శిటీలో శనివారం గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా మరో యువతి వీడియో తీసింది. ఇలా 60 మంది అమ్మాయిలు స్నానం చేస్తున్న వీడియోలను ఫోన్ లో షూట్ చేసింది. ఈ వీడియోలను సిమ్లాలో ఉండే ఓ యువకుడికి పంపించింది. అతడు ఆ వీడియోలను సోషల్ మీడియాతోపాటు ఫోర్న్ సెట్లలోనూ అప్ లోడ్ చేశాడు. దీంతో బాధిత విద్యార్థినులు తమ వీడియోలను నెట్ లో చూసి షాక్ తిన్నారు. తీవ్ర మనస్తాపానికి గురైన వారిలోని ఎనిమిది మంది సూసైడ్ అటెంప్ట్ చేశారు. దీనిని యూనివర్సిటీ యజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా పట్టించుకోలేదని విద్యార్థినులు వాపోయారు. ఈ నేపథ్యంలో వర్సిటీ క్యాంపస్ లో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. అర్ధరాత్రి చండీగఢ్ యూనివర్సిటీని చుట్టుముట్టి 'వి వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేశారు.
Protest breaks out in Chandigarh University after someone secretly recorded videos of girls from hostel bathroom and leaked them online. University administration is trying to muzzle the protest, according to a student : @PunYaab
— Yogita Bhayana योगिता भयाना (@yogitabhayana) September 17, 2022
Also Read: Nepal: నేపాల్‌లో వరుణుడి ఉగ్రరూపం.. కొండచరియలు విరిగిపడి 17 మంది దుర్మరణం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook