కశ్మీర్ ఎఫెక్ట్: ఉగ్రమూకలు దాడికి వ్యూహం: ఐబీ హెచ్చరికలు జారీ

కశ్మీర్ అంశంపై భారత్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంతో రగిలిపోతున్న ఉగ్రమూలు ...దాడులకు తెగబడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు

Last Updated : Aug 7, 2019, 11:47 AM IST
కశ్మీర్ ఎఫెక్ట్: ఉగ్రమూకలు దాడికి వ్యూహం: ఐబీ హెచ్చరికలు జారీ

కశ్మీర్ విషయంలో మోడీ సర్కార్ తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో రగిలిపోతున్న ఉగ్రమూకలు... భారత్ లో నరమేధం సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. పార్లమెంట్ లో ఆర్టికల్‌ 370 రద్దు బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో సామాన్య ప్రజానికమే లక్ష్యంగా విరుచుకుపడేలా కుట్రలు పన్నుతున్నట్లు తెలిపింది. తొలుత పంజాబ్ రాష్ట్రాన్ని లక్ష్యం చేసుకున్నారని... ఈ మేరకు ఆపరేషన్ మెుదలెట్టినట్లు  నిఘా వర్గాలు తెలిపాయి. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. 

పంజాబ్ లో హై అలర్డ్

ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్సీ నుంచి సమాచారం అందడంతో  పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా రద్దీగా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  అమరీందర్ సింగ్  జోన్ల వారిగా సమీక్షలు నిర్వహస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్ర మూకల కుట్రలను భగ్నం చేసేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశాలు జారీ చేశారు. సున్నితమైన ప్రదేశాలకు  కేంద్ర బలగాలను మొహరించనున్నారు.

Trending News