మెరుపువేగంతో రైలుతో పాటు పరిగెత్తి పసికందుకు పాలందించిన కానిస్టేబుల్...

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వలసకార్మికులు ప్రత్యేక రైళ్ల ద్వారా తమ స్వస్థలాలకు చేరుకొంటున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ వెళుతున్న రైలు భోపాల్‌లో రైల్వే స్టేషన్‌లో కొన్ని నిమిషాల పాటు 

Last Updated : Jun 5, 2020, 09:12 PM IST
మెరుపువేగంతో రైలుతో పాటు పరిగెత్తి పసికందుకు పాలందించిన కానిస్టేబుల్...

న్యూడిల్లీ: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వలసకార్మికులు ప్రత్యేక రైళ్ల ద్వారా తమ స్వస్థలాలకు చేరుకొంటున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ వెళుతున్న రైలు భోపాల్‌లో రైల్వే స్టేషన్‌లో కొన్ని నిమిషాల పాటు ఆగింది. ఓ తల్లి (షఫియా హష్మి) తన బిడ్డకు పాల కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) కానిస్టేబుల్ (ఇందర్ యాదవ్)ను సహాయం కోరింది. కాగా కాస్త ఆలస్యం కావడంతో రైలు కదలడంతో ఒకవైపు తన భుజానికున్న రైఫిల్ మరో చేతితో పాలడబ్బాతో రైల్వే ప్లాట్ ఫామ్ పై మెరుపువేగంతో పరిగెత్తి ఆ తల్లికి అందించాడు. 

Also Read: Civil Services Examinations 2020: అక్టోబర్ 4న ప్రిలిమ్స్, జనవరిలో మెయిన్స్..

 

చివరకు ఇంటికి చేరుకున్న సఫియా హష్మి మాట్లాడుతూ తనకు సహాయం చేసిన కానిస్టేబుల్ కు ధన్యవాదాలు తెలియజేసింది. పాలు లేకపోవడంతో తన కుమార్తెకు బిస్కెట్లను నీటిలో ముంచి తినిపించేదాన్ని అని రోదించింది. అయితే సాహసం చేసిన రైల్వే కానిస్టేబుల్ పై పలువురు ప్రముఖుల నుండి ప్రశంసలందుకున్నాడు. ఇందర్ యాదవ్ వారి జీవితానికి "నిజమైన హీరో" అని చాలా మంది ట్విట్టర్‌లో ప్రశంసించారు.

Also Read: రహస్య జీవోలు ఎందుకు ? సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కృషిని ప్రశంసించారు, 4 సంవత్సరాల చిన్నారికి పాలు అందించడానికి రైలుతో పాటు పరుగెత్తి చేసిన సహకారం ఎంతో ఆదర్శవంతమైన విధిని అన్నారు. మనోజ్ సక్సేనా స్పందిస్తూ  అతను ఒక జీవితాన్ని కాపాడాడని, ఇతరులకు ఒక ఉదాహరణని ఆయన సేవలను కొనియాడారు. 

 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News