Zee founder Subhash Chandra: దత్తత గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన జీ వ్యవస్ధాపకులు సుభాష్ చంద్ర

Rajya Sabha MP, Zee founder Subhash Chandra: ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ''గ్రామాల్లో రైతులు, మహిళలు, యువత అభివృద్ధిపథంలో పయణించినప్పుడే గ్రామీణ స్వరాజ్యం (Rural swaraj) సాధ్యపడుతుంది'' అని అన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2021, 10:48 PM IST
Zee founder Subhash Chandra: దత్తత గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన జీ వ్యవస్ధాపకులు సుభాష్ చంద్ర

Rajya Sabha MP, Zee founder Subhash Chandra: న్యూ ఢిల్లీ: రాజ్యసభ సభ్యులు, జీ మీడియా సంస్థ వ్యవస్థాపకులు అయిన సుభాష్ చంద్ర సన్సద్ ఆదర్శ్ గ్రామ యోజన కార్యక్రమం (Sansad Adarsh Gram Yojana) కింద హర్యానాలోని హిసార్ జిల్లాలో తాను దత్తత తీసుకున్న గ్రామాల్లో మంగళవారం పర్యటించారు. అడంపూర్, సదల్‌పూర్, అడంపూర్ మండి గ్రామాల్లో పర్యటించిన సుభాష్ చంద్ర.. అక్కడి రైతులు, మహిళలు, యువతతో ముచ్చటించి వారిని ప్రోత్సహిస్తూ పలు సూచనలు, సలహాలు అందించారు. పెస్టిసైడ్స్ వినియోగం లేకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ పద్ధతిలో (Organic farming) సహజ సిద్ధంగా పంటలు పండించడం ద్వారా ఆదాయానికి ఆదాయం, ఆరోగ్యానికి ఆరోగ్యం సంపాదించుకోవచ్చని రైతులకు సూచించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ''గ్రామాల్లో రైతులు, మహిళలు, యువత అభివృద్ధిపథంలో పయణించినప్పుడే గ్రామీణ స్వరాజ్యం (Rural swaraj) సాధ్యపడుతుంది'' అని అన్నారు. రైతులు అధిక ఆదాయం పొందినప్పుడే వారి పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించగలరని వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. 

క్రీడలు, సామాజిక సేవతో పాటు పలు ఇతర రంగాల్లో ముందంజలో రాణిస్తున్న వారిని సన్మానించి ప్రోత్సహించారు. సదల్‌పూర్ గ్రామంలో ధర్మశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి అడంపూర్ వెళ్లిన సుభాష్ చంద్ర (Mr Subhash Chandra).. అక్కడి గోశాలలో మరో షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దేశం, సమాజం బాగుండాలని కోరుకుంటూ కుల్దేవి మాతా లక్ష్మీ ఆలయంలో (Kuldevi Mata Lakshmi) ప్రత్యేక పూజలు జరిపారు.

Trending News